కేసీఆర్ ‘ఏడుపుల’కు టీడీపీ ఆనకట్ట..!

పార్టీ ఓడినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఏడవడం, ఆంధ్రప్రదేశ్ నీటి ప్రోజెక్టుల మీద పడి ఆరోపణలు చేయడం కేసీఆర్ కి బాగా అలవాటు అనేలా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిఆర్ఎస్ తో పాటుగా కేసీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ పార్టీలో రాజకీయంగా ఎదిగి, బాబు ప్రభుత్వంలో మంత్రి రాక, పదవి పోయి ఉద్యమాలు చేసిన కేసీఆర్ ఇప్పుడొచ్చి అదే టీడీపీ పై అదే బాబు పై ఏడుపులు మొదలుపెట్టారని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో నిర్మించిన నీటి ప్రోజెక్టుల పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతుందని,

ADVERTISEMENT

కాళేశ్వరం లో అవినీతి, మేడికొండ పంచాయితీ, ఫోన్ టాపింగ్ రచ్చ ఇలా బిఆర్ఎస్ చుట్టూ, కల్వకుంట్ల కుటుంబం చుట్టూ అవినీతి ఆరోపణలు నడుస్తున్న ఈ నేపథ్యంలో,

ఏడవలేక మద్దెల దరువు మాదిరి అక్కడ రేవంత్ సర్కార్ పై తమ ప్రతాపం చూపించలేక ఆంధ్రప్రదేశ్ నీటి ప్రోజెక్టుల మీద, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసీఆర్ అండ్ కో పడేడుస్తున్నారు అంటూ బుచ్చయ్య కేసీఆర్ ఏడుపులకు తన కౌంటర్లతో ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే దిగువ రాష్ట్రం, తెలంగాణ నుంచి సముద్రంలో కలిసి వృధా అయ్యే నీటిని దిగువ రాష్ట్రంగా ఏపీ వినియోగించుకుంటే అందుకు కేసీఆర్ అనుమతి కావాలా.? బిఆర్ఎస్ పార్టీని ఒప్పించాలా.? అనేది టీడీపీ నేతల ప్రశ్న.

అలాగే పోలవరం నుంచి బనకచర్ల వరకు ఏపీ నిర్మిస్తున్న నీటి ప్రోజెక్టుల కోసం కేంద్ర అనుమతులతో పాటు బిఆర్ఎస్ నేతల అనుమతి కూడా తప్పనిసరా.? కేసీఆర్ నుంచి కవిత వరకు దాని మీద వారి ఆమోద ముద్ర వేయాలా.? అసలు బిఆర్ఎస్ సమస్య ఆంధ్రప్రదేశ్ నీటి ప్రోజెక్టుల మీద లేక ఏపీకి ముఖ్యంమత్రిగా చంద్రబాబు గెలవడం మీదా.?

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎద్దడిముబ్బడిగా నిర్మించిన నీటి ప్రాజెక్టులకు కేసీఆర్ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారా.? తెలంగాణలో కాళేశ్వరం నిర్మిస్తే కర్ణాటక రైతుల నీటి హక్కులను కేసీఆర్ అక్రమంగా దోచుకున్నట్టా.?

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఏపీ ప్రజలను మోసం చేసేందుకే బిఆర్ఎస్ నిర్మించిందా.? వారి హయాంలో రాష్ట్రానికి నీటి ప్రోజెక్టుల నిర్మాణం జరిగితే అది రాష్ట్ర అభివృద్ధి, అదే ఇతర ముఖ్యమంత్రుల హయాంలో పొరుగు రాష్ట్రాలలో నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే అది తెలంగాణ ద్రోహం.? ఇదేనా కేసీఆర్ చెపుతున్న జాతీయవాదం.? బిఆర్ఎస్ వదులుకున్న ప్రాంతీయవాదం.? అందుకేనా కేసీఆర్ పార్టీ పేరును తెరాస నుంచి బిఆర్ఎస్ గా మార్చింది.?

ఇలా ప్రతిసారి బాబు ప్రభుత్వంలో ఏపీ లో నిర్మించే ప్రతి ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయం చేయడమే, ఇక్కడి ప్రజల నీటి హక్కులను అక్రంగా హరించడమే అంటూ కేసీఆర్ వాదించడం ఎంతవరకు సమంజసం.? తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నీటి ప్రాజెక్టులు ఏపీ వినాశాన్ని కోరుకుంటాయా.?

అలాగే ఏపీలో నిర్మించబోతున్న ప్రాజెక్టులు తెలంగాణ నాశనాన్ని కాంక్షిస్తాయా.? ఇన్నాళ్ల బిఆర్ఎస్ నిందలకు, కేసీఆర్ అండ్ కో చేస్తున్న రాజకీయ విమర్శలను భరించిన టీడీపీ ఎట్టకేలకు స్పందించడం, అటు కేసీఆర్ కి ఈ స్థాయి కౌంటర్ వేయడం అంటే టీడీపీ ఇకనుంచి బిఆర్ఎస్ తో రాజకీయ యుద్దానికి సిద్ధమైందని భావించాలా.?

టీడీపీ పైనా బాబు పైన కేసీఆర్ రాజకీయ ఏడుపులకు, బిఆర్ఎస్ పొలిటికల్ వ్యూహాలకు బాబు అండ్ కో 2025 చివరి రోజు ఆనకట్ట కట్టేందుకు సంకల్పం చేసుకున్నారా.? అయితే టీడీపీ స్పందనకు అటు బిఆర్ఎస్ నుంచి కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకు మించిన మోతాదులో ఎదురుదాడి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి టీడీపీ సిద్ధమా అనేది చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

3 Idiots Sequel Demand: Trouble for Aamir’s New Ind-Pak Film

Aamir Khan has finalized his upcoming film schedule by locking in two major projects. The…

12 minutes ago

పుష్పకి చీప్ కాపీ ఈ మలయాళ సినిమా

బాహుబలి లాంటి సినిమా తీయాలి అని చేతులు కాల్చుకున్నవాళ్ళని చాలామందిని చూసాం. దాదాపు అన్నీ భాషల ఇండస్ట్రీలు ఆ ప్రయత్నం…

14 minutes ago