
TDP and Jana Sena Face Questions Over Party Expansion in AP
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన… రెండు పార్టీలు నేర్చుకోవాల్సిన కొన్ని కొత్త పాఠాలు కనిపిస్తున్నాయి.
ఓ నెటిజన్ ఏమన్నారంటే, 175 స్థానాల్లో టీడీపీని ఎలా బలోపేతం చేసుకోవాలని ఆలోచన చేయకుండా అన్నదమ్ముల అనుబంధం, ఆదర్శ కుటుంబం అంటూ సినిమాలు చూపిస్తున్నారంటూ టీడీపికి చురకలు వేశారు.
ఈ విషయంలో టీడీపి కంటే జగన్ చాలా ముందున్నారని, ఆయన 175/175 అన్నప్పుడే అందరూ అర్థం చేసుకోవాల్సింది. కానీ అది అహంకారంగానో, అతిశయంగానో అందరూ చూశారు తప్ప ఎవరూ ‘అవును కదా?’ అని అనుకోలేదు.
అయన సిఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే 2024 ఎన్నికలలో 175/175 సాధించాలనే లక్ష్యంతోనే పని మొదలుపెట్టారు. కానీ అయన వ్యూహాలు విధ్వంసకరంగా మారడంతో ఫలించలేదని అందరికీ తెలుసు.
మరి ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ టీడీపీ ఎప్పుడైనా 175/175 ఆలోచన చేసిందా? ఎందుకు ఆ దిశలో ఆలోచన, ప్రయత్నాలు చేయడం లేదు? అనే ఆ నెటిజన్ ప్రశ్న ఆలోచింపజేసేదే కదా!
ఇక జనసేన విషయానికి వస్తే, తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై గట్టిగా కృషి చేయాలి. కానీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై కూడా ఎవరూ శ్రద్ధ చూపలేదని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు కదా?
పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే దృష్టి పెట్టాల్సి ఉండగా, ఒకసారి సనాతనధర్మ పరిరక్షణ అంటారు. మరోసారి తెలంగాణ, తమిళనాడు రాజకీయాలలో వేలు పెడుతుంటారు. ఆరోగ్య సమస్యలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.
అయినా అడపాదడపా సినిమాలు చేయడం మానుకోవడం లేదు. ఒక వ్యక్తి ఇన్ని పడవలలో కాళ్ళు పెట్టి వేగంగా ముందుకు సాగాలనుకుంటే సాధ్యపడుతుందా? ఒకసారి ఆలోచిస్తే మంచిది.
ఇప్పుడు ఈ ఎన్నికలలో ఈ సీట్ల కథ ముగిసిన తర్వాత అయినా, వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసుకోవడంపై, పార్టీలో బలమైన నాయకులను తయారు చేసుకోవడంపై అందరూ దృష్టి పెడితే మళ్ళీ ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురవదు… కదా?
Congress MLC Balmoor Venkat’s latest comments on KTR have opened up a fresh line of…
ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల సైరన్ తో రాష్ట్ర రాజకీయాలలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజకీయాలకు…