Telugu

టీడీపీ – జనసేన మధ్య ‘ఓట్ ట్రాన్స్ ఫర్’ సాధ్యమా.?

కూటమి విజయంలో ఓట్ ట్రాన్స్ ఫర్ అనే ప్రక్రియ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని రాజకీయ ప్రకటనలు, ఆ పార్టీ నేతలు చేసిన కొన్ని అసందర్భ పోస్ట్ లు టీడీపీ, జనసేన ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కి దారి తీసాయి.

ఈ నేపథ్యంలో కూటమిలో నాది పై చేయి అంటే నాది పై చేయి అంటూ ఇరు పార్టీల సోషల్ మీడియా యూజర్స్ అనవసరమైన యుద్దాన్నికి తెరలేపారు. ఇటువంటి సందర్భంలో ఇరు పార్టీల మధ్య ఓట్ షేరింగ్ సంక్రమంగా సాగుతుందా.? 2024 నాటి ఫలితాలను ఆశిస్తున్న ఇరు పార్టీల అధినేతల ఆశలు అత్యాశలుగా మారనున్నాయా.? అన్న చర్చ మొదలయ్యింది.

ADVERTISEMENT

నాడు పోటీ చేసేది టీడీపీ నేతా, జనసేన నాయకుడా, బీజేపీ అభ్యర్దా అన్న తేడా చూడకుండా వైసీపీ వ్యతిరేక నేత అయితే చాలు అనేలా కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలు తమ బలమైన మద్దతు ప్రకటించారు. ప్రజామద్దతుతో బలమైన ప్రభుత్వంగా పాలన మొదలుపెట్టిన కూటమి గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక స్థితి గతులను మార్చగలిగింది.

అటు రాష్ట్ర రాజధాని గా అమరావతి చట్టబద్ధత కలిపించింది. ఇక రాజధాని నిర్మాణాలను వేగవంతం చేస్తూ ఆ ప్రాంత మౌలిక అవసరాలను పూర్తి చేస్తుంది. అలాగే ఇటు గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, అటు ఉత్తాంధ్ర జిలాల్లో పారిశ్రామిక ప్రగతి, ఇటు రాయలసీమలో నీటి కరువు సమస్యల పరిష్కారం అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు సీఎం బాబు.

ఇక పవన్ తన పనితీరుతో దేశంలోనే పంచాయితీ రాజ్ శాఖను మొదటి స్థానంలో నిలబెట్టారు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు రోడ్లు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామాలలో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణంతో ముందుకెళుతున్నారు.

అలాగే విద్యా మంత్రి నారా లోకేష్ సైతం తన శాఖలో తెచ్చిన వినూత్న మార్పులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నో బ్యాగ్ డే, విద్యార్థులకు బలమైన పౌష్టికాహారం వంటి సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలో కూడా నో అడ్మిషన్స్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.

ఇలా ఈ ముగ్గురు నేతలు కూడా తమ పాలనావిధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తరుణంలో కూటమి vs వైసీపీ మధ్య స్థానిక ఎన్నికలు ‘వార్ వన్ సైడ్’ అన్నటుగా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్ ఉంటుందా అన్న స్థాయికి ఎందుకు దిగజారింది.?

కూటమి అభివృద్ధి పాలనతో టీడీపీ, జనసేన పార్టీలకు పెరగాల్సిన ‘ఓట్ షేర్’ నేతల రాజకీయ ప్రకటనలతో, పార్టీ శ్రేణుల సోషల్ మీడియా యుద్ధాలతో ఇప్పుడు అయోమయంలో పడిందా.? అన్న మీమాంస మొదలయ్యింది. ఇక ఇప్పటికైనా ఈ ఇరు పార్టీల శ్రేణులు తమ వ్యక్తిగత భావోద్వేగాలను కాసేపు పక్కన పెట్టి కూటమి కోసం క్షేత్ర స్థాయిలో ఉమ్మడి రాజకీయ శత్రువు పై పోరాటానికి ముందుకొస్తారా.? లేదా ఇరు పార్టీల అంతర్గత రాజకీయ యుద్ధాలతో వైసీపీ గెలుపుకు ద్వారాలు తెరుస్తారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vrushakarma: Chay’s Mysterious Journey Unveiled

The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…

49 minutes ago

Traitors Telugu: Teja Sajja Makes His Hosting Debut

The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…

60 minutes ago