Telugu

రావాలి జగన్…కావాలి జగన్ అంటున్న కూటమి!

151 సీట్లు గెలిచిన అహంకారానికి గత ఐదేళ్లు అసెంబ్లీ వేదికగా నిలిస్తే, 164 సీట్లు గెలిచిన బాధ్యతకు ఈ ఐదేళ్లు అసెంబ్లీ సాక్షిగా నిలవనుంది. అధికార పక్షం అంటే ప్రతిపక్షాన్ని అణిచివేయడమే, ఆ పార్టీ నేతలను కించపర్చడమే అన్నట్టుగా సాగిన నాటి కౌరవ సభకు, అధికార పక్షం అంటే ప్రతిపక్షంతో ప్రజా సమస్యల మీద డిబేట్ చేయడమే అని సాగే నేటి గౌరవ సభకు వ్యత్యాసాన్ని గమనించాలి అంటే జగన్ అసెంబ్లీకి వెళ్లాల్సిందే.

వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష మావాళ్లు 151 మంది ఉన్నారు, ఒక్కసారి వాళ్ళంతా లేస్తారు అంటే వీళ్ళెవ్వరూ వాళ్ళ స్థానాలలో కూడా కూర్చోలేరు అంటూ ఒక ముఖ్యమంత్రి గా జగన్ ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలను ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వాళ్ళను నీడలా వెంటాడుతున్నాయి. ఇప్పుడు టీడీపీ కూటమి 164 మంది సభ్యులతో కళకళలాడుతుంటే వైసీపీ 11 కి పరిమితమై విలవిలలాడుతోంది.

ADVERTISEMENT

కళ్ళు రెండు పెద్దవి చేస్తే ఎవ్వరు భయపడరు, ఒళ్ళు పెంచడం కాదు బుర్ర పెంచాలి, అసలు అసెంబ్లీ నడపడం తెలుసా మీకు, మీరెలా ఎమ్మెల్యే లు అయ్యారయ్యా, బుద్ధిలేదా, కూర్చో కూర్చో అంటూ గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల పై వాడిన భాష ఇప్పుడు వైసీపీ నేతలకు శాపంలా మారి జగన్ అసెంబ్లీకి రావాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ కూటమి నేతలు వైసీపీ కి ఆహ్వానం పలుకుతున్నారు.

ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన చట్ట సభలలో గత ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులు తిట్టడం, వారి ఇంట్లో మహిళలను అగౌరవ పరిచే వ్యాఖ్యలు చేయడం, కించపరచడం, వ్యక్తిత్వ హననం చేయడం చేసిన వైస్ జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే చేసిన కర్మ ఫలం ఎక్కడ తిరిగి తనను చుట్టుకుంటుందో అనే భయంతో అసెంబ్లీ కి రాకుండా తప్పించుకుంటున్నారు.

దానికి తోడు వైసీపీ పార్టీ ఎంపీగా ఉంటూ వైసీపీ పార్టీని, జగన్ ను గత ఐదేళ్లు శికండిలా వెంటాడిన రఘురామా కృష్ణ రాజు నేడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోబడడం జగన్ కు మరో ఎదురు దెబ్బనే చెప్పాలి. అయితే ఇక్కడే కూటమి నేతలు వైసీపీ నినాదం ‘రావాలి జగన్ కావాలి జగన్’ తోనే జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. కానీ జగన్ అసెంబ్లీ గేట్ తాకడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

అందులో మచ్చుకకి కొన్ని ఇప్పుడు చూద్దాం. గతంలో చేసిన పాపాలు ఇప్పుడు వైసీపీకి 11 గా తిరిగి రావడం, మరో పక్క తానూ అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తారు అనే భాద, తానూ ఇన్నాళ్లుగా ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అంటూ అవమానించిన పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చూడాలనే ఆవేదన కావచ్చు.

పప్పు పప్పు అన్నవాడే వైసీపీ కి నిప్పు పెడుతున్నాడే అన్న ఆక్రోశం, తానూ పగ తీర్చుకున్నవాడే తన పై పెత్తనం చేస్తాడు అనే భయం అన్ని కలగలిపి జగన్ ను అసెంబ్లీ కి దూరంగా ప్యాలస్ కు దగ్గర ఉంచుతున్నాయి.

ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్న జగన్ 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లను వెంటేసుకుని అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారా.? ప్రజలిచ్చిన తీర్పుని గురవిస్తు కూటమి నేతలు పలుకుతునన్ ఆహ్వానాన్ని మన్నిస్తూ RRR ఆశను ఆకాంక్షను జగన్ నెరవేరుస్తారా.? లేక ఈ విషయంలో చెల్లి షర్మిల చెప్పినట్టు వైస్సార్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏమి లేదని నిరూపించుకుంటారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Janani Makes Black And White Look Hot!

Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…

22 minutes ago

Indian 3: Shankar-Kamal’s Best Sequences Yet to Come?

Ever since Lyca Productions dropped the official announcement on Indian 3, suggesting that the pending…

42 minutes ago