
ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులలో భాగంగా జనసేనకు కనీసం 50 సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టగా 38 సీట్లు లభించిన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అయితే టిడిపి, జనసేనలే సీట్లు సర్దుబాట్లను ‘ఇరుకు చొక్కా’ అని ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు బీజేపీకి కూడా ఆ ఇరుకు చొక్కాలో దూరేందుకు అదే సిద్దమైందో లేదా చంద్రబాబు నాయుడే దానిని కూడా దూర్చేందుకు ప్రయత్నిస్తున్నారో తెలీదు కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళారు. తిరిగి రాగానే ఇరుకు చొక్కా సైజు ఇంకా పెరుగుతుందా లేదో తెలుస్తుంది.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె పార్టీ నేతలు ఇస్తున్న తాజా సంకేతాల ప్రకారం ఈసారి ఎన్నికలలో బీజేపీ ఒంటరి పోరాటానికి సిద్దం అవుతున్నట్లు అర్దమవుతోంది. కనుక తమతో బీజేపీ పొత్తులు పెట్టుకోకపోయినా, ఎన్నికలలో టిడిపి, జనసేనలకు అవసరమైన సహాయ సహకారాలు అందివ్వాలని కోరేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఉండవచ్చు.
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో మాట్లాడుతూ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఈసారి ఎలాగైనా తనను గద్దె దించేయాలని కుట్రలు పన్నుతున్న చంద్రబాబు నాయుడు, బీజేపీతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా అవగాహన కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు.
అయితే గతంలో తాము కూడా అదే చేశామని, ఇప్పటికీ అదే చేస్తున్నామనే విషయం జగన్ గుర్తులేన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు పోతాయి కనుక గత ఎన్నికలలో మాదిరిగానే ఈసారి కూడా తమకు ఎన్నికలలో అవసరమైన సహకారం అందిస్తే చాలని ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా మోడీ, అమిత్ షాలను జగన్ కోరుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా వారిని అదే కోరుతున్నప్పుడు అది కుట్ర ఎలా వుతుంది?
రాష్ట్రంలో బీజేపీకి బలం, ప్రజాధరణ లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అందరికీ తెలుసు. ఎన్నికలలో వైసీపి దౌర్జన్యాల టిడిపి, జనసేనలు రెండూ అడ్డు కట్టవేయలేవు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్ర ఎన్నికల కమీషన్ ద్వారా అడ్డుకట్ట వేయవచ్చు.
ఈవిషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కానీ అలా చెప్పుకోలేరు కనుక తనని గద్దె దించడానికి కుట్రలని చెప్పుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరగవచ్చు. ముఖ్యంగా దానికీ కొన్ని సీట్లు పంచి ఇవ్వడం ఇంకా కష్టం. కనుక దాంతో దూరంగా ఉంటేనే టిడిపి, జనసేనలకు మంచిది.
Palak Tiwari makes a striking case for unapologetic pink in this vibrant saree photoshoot. Her…
Following the terrible failure of Retro, Karthik Subbaraj has made a comeback with the film…