Telugu

బీసీ నాయకత్వం పై గొడ్డలి వేటు వేసింది వైసీపీ..!

బీసీ డిక్లరేషన్ పేరుతో ఈ రోజు టీడీపీ – జనసేన కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో ఇరు పార్టీల అధినేతలు తాము అధికారంలోకి వస్తే బీసీలకు అమలు పరిచే పథకాలను వివరిస్తూ అధికార వైసీపీ పార్టీ పై నిప్పులు చెరిగారు.

గత ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేసి వారి ఓట్లు దండుకున్న వైస్ జగన్ అధికారంలోకి రాగానే అదే బీసీల నడ్డి విరిచారు అంటూ పవన్ భవన నిర్మాణకార్మికుల ఉదంతాన్ని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలిసీని రద్దు చేసి దాని మీద ఆధారపడిన బీసీ వృత్తుల వారి పొట్ట కొట్టి వారి చావులకు కారణమయ్యారు జగన్ అంటూ పవన్ వైసీపీ సర్కార్ విధానాలను ఎండగట్టారు.

ADVERTISEMENT

అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 3 వందల మంది బీసీల పై దాడులు చేసి వారిలో కొంతమందిని హతమార్చి బీసీల పట్ల తమ వైఖరిని వెళ్లబుచ్చారు జగన్ అంటూ రాష్ట్రంలో బీసీల పై జరిగిన దాడులను వివరించారు నారా లోకేష్. అలాగే గతంలో 5300 తేడాతో కరకట్ట కమల్ హాసన్ చేతిలో ఓడిపోయిన నేను దాని పక్కన ఒక సున్నాను జోడించి 53000 మెజారిటీతో గెలిచి తీరుతా అంటూ పవన్, బాబులకు హామీ ఇచ్చారు.

బీసీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్నాళ్లుగా టీడీపీ కి కంచుకోటలా ఉన్న బీసీ సోదరులు గత ఎన్నికలలో జగన్ రెడ్డి చెప్పిన మాయమాటలకు లొంగిపోయి వైసీపీకి మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జగన్ బీసీ పట్ల తన అసలు రంగు బయటపెట్టారు. ఎన్నాళ్ళుగానో ప్రజా సేవలో ఉంటున్న అచ్చం నాయడు, అయ్యన పాత్రుడు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత వంటి బీసీ నాయకుల పై వైసీపీ సర్కారు అనుసరించిన వైఖరిని వివరించారు బాబు.

బీసీ నాయకులు రాజకీయంగా ఎదగకుండా వారి పై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి బీసీ నాయకత్వం పై గొడ్డలి వేటు వేసాడు జగన్ అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు. జయహో బీసీ నినాదంతో సభను ఆరంభించిన నేతలు….బీసీ లకు హామీలు, వైసీపీకి కౌంటర్లు వేస్తూ సభను ముంగిచారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aurora Temple Shooting Plot Foiled, But Fear Remains

An alleged mass shooting plot involving a Hindu temple in Aurora, Illinois, has been foiled,…

9 minutes ago

No Birthday Gift for Gambhir? Team India’s Hyd Nightmare

Gautam Gambhir turned 45 on Wednesday, October 14, but there was no birthday gift waiting…

24 minutes ago