Telugu

జగన్ కు కలిసొచ్చేలా చేస్తోన్న ‘టీడీపీ + జనసేన’

‘వన్ సైడ్ లవ్’ వర్కౌట్ అవ్వదు తమ్ముళ్లు : పొత్తుల గురించి స్వయంగా చంద్రబాబు అన్న వ్యాఖ్యలు.

‘వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులలో ఈ సారి పోనివ్వను’ – పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.

ADVERTISEMENT

ఈ రెండింటి అంతరార్ధం, పరమార్ధం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! రాబోయే ఎన్నికలలో జనసేన + టీడీపీల కలయిక అనివార్యం కాబోతున్న నేపధ్యంలో… ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఆఫ్ లైన్ లో ఎలా ఉందో తెలియదు గానీ, ఆన్ లైన్ లో మాత్రం ఇరువురు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ వైసీపీకి మరియు జగన్ కు కలిసొచ్చేలా చేయడంలో తమ వంతు పాత్రను పోషించుకుంటున్నారు.

ఆవిర్భావ సభలో ‘నేను మూర్ఖుడిని’ అన్న నారా లోకేష్ వ్యాఖ్యలను మాత్రమే కట్ చేసి జనసేన సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేయగా, వాటికి బదులుగా నారా లోకేష్ అసలు పూర్తిగా ఏం మాట్లాడారో తెలుసుకోండి అంటూ ‘నారా లోకేష్ మాట్లాడిన పూర్తి వీడియోలను పోస్ట్ చేస్తూ’ టీడీపీ సోషల్ మీడియా వింగ్ బదులిచ్చింది. ఇది ఇప్పటి నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన విషయం మాత్రం కాదు.

సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల నడుమ జరిగిన అనేక కోట్లాటలలో, ఇది లేటెస్ట్ ది మాత్రమే. అంతకుముందు టీడీపీ వర్గీయులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను కూడా ఇలాగే ట్రోల్ చేసారు. ఇప్పుడు వీరికి అవకాశం వచ్చిందని జనసేన వర్గీయులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. అయితే జనసేన చేస్తోన్న ట్రోల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది… ఎందుకంటే టీడీపీ నేతలు గానీ, అధినేతలు గానీ మీడియా ముందుకు ఎక్కువగా వస్తున్నారు గనుక వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నట్లుంది.

ఈ సందర్భంగా జనసేన వర్గీయులు తెలుసుకోవాల్సింది ఒక్కటుంది. ఒంటరిగా పోటీచేసే సత్తా గానీ, క్యాడర్ గానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జనసేనకు లేదు. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ అభిమానులకు ఇది కాస్త జీర్ణించుకోలేని అంశమే అయినా, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా అని పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ప్రభావం చూపలేరా అంటే? ఖచ్చితంగా కాదు అన్న సమాధానమే వెలువడుతుంది.

ఒంటరిగా పోటీచేసి తాను గెలిచే సత్తా లేకపోయినా, మరొక పార్టీని (అది వైసీపీ అయినా, టీడీపీ అయినా) అధికారంలోకి తీసుకురాగల సత్తా పవన్ సొంతం. 2014లో టీడీపీకి సహకారం అందించి పసుపు జెండా ఎగురవేయడంలో తన వంతు సాయం చేసిన పవన్, 2019లో టీడీపీ ఓట్ బ్యాంకును చీల్చి వైసీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సాయం అందించారు. పార్టీ ఇంకా బలోపేతం కాలేదు గనుక, ఈ సారి కూడా మరో పార్టీకి దోహదపడే పరిస్థితులలోనే జనసేన ఉంది గానీ, ఒంటరిగా వెళితే భంగపడడం తప్ప మరొకటి లేదు.

వైసీపీతో జత కట్టే అవకాశాలు నూటికి నూరు శాతం లేవు గనుక, ఖచ్చితంగా టీడీపీతో సఖ్యతగా ఉండాల్సి వస్తుంది. విశేషమైన క్యాడర్ ఉన్న టీడీపీ + జనసేనల కలయికే వైసీపీ గుండెల్లో గుబులు రేపే అంశం. ఇది జరుగకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు రాజకీయంగా వైసీపీ చేయవచ్చు. కానీ వీటన్నింటిని చేధించుకుని అధికారం దక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఈ రెండు పార్టీలకు ఉంది. అలా కాకుండా ‘టామ్ అండ్ జెర్రీ’గా కొట్టుకుంటాము అనుకుంటే, అది చూస్తోన్న వైసీపీకి వినోదంలాగానే ఉంటుందని ఇరువురు పార్టీ వర్గీయులు తెలుసుకోవాలి.

అయినా రెండు పార్టీల అధినేతలు ఒక రూట్ లో పయనిస్తుంటే, వారి సోషల్ మీడియా మరొక దారిలో వెళ్తుండడం పార్టీల అధిష్టానాలు గుర్తించడం లేదా? గతంలో శ్రీరెడ్డి, కత్తి మహేష్ లను ఏబీఎన్, టీవీ5లలో ఇలా కూర్చోపెట్టి చోద్యం చూసినందుకే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంది. మళ్ళీ ఇలాంటివే సోషల్ మీడియాలో కూడా జరుగుతుంటే… చూస్తూ ఊరుకుంటే చివరికి అది ఎక్కడికి దారి తీస్తుందో ఇప్పుడే ఆలోచించుకోవాలి. లేదంటే ఈ సారి ‘రామ రామ’ అన్నా ఎవరూ క్షమించరు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vaazha 2: Blockbuster in Theatres, Overrated on OTT?

Vaazha II: Biopic of a Billion Bros directed by Savin SA was released in theatres…

20 minutes ago

Photos: PM Modi Visits CBN, PK Residence

Photos: PM Modi Visits CBN, PK Residence

40 minutes ago