
టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పార్టీల ముఖ్యనేతలతో కలిసి నేడు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశమై అభ్యర్ధుల జాబితాపై చర్చించిన తర్వాత తొలి జాబితాని ప్రకటించారు.
175 శాసనసభ స్థానాలలో టిడిపి 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. జనసేనకు మొత్తం 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాలు దక్కాయి. వాటిని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తున్నారు.
దీంతో మొత్తం 175 స్థానాలకు టిడిపి, జనసేనలు కలిపి 118 మంది అభ్యర్ధులను ప్రకటించాయి కనుక మిగిలిన 57 స్థానాలకు బీజేపీతో పొత్తుల విషయం తేల్చుకున్న తర్వాత ప్రకటించనున్నాయి.
ఇప్పటి వరకు ప్రకటించిన జనసేన అభ్యర్ధులు వీరే:
తెనాలి: నాదెండ్ల మనోహర్, రాజానగరం: భగవాన్ కృష్ణ, అనకాపల్లి: కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల: మాధవి.
Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…
Sambarala Yeti Gattu, the upcoming period action drama starring Sai Durgha Tej, has released its…