
ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా విజయవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది సతీష్ అనే ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ కేసులోకి టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా ను ఇరికించే ప్రయత్నం వైసీపీ చేస్తుందంటూ టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది.
2019 ఎన్నికల ముందు విశాఖలో జగన్ పై జరిగిన కోడికత్తి ఘటనతో శ్రీను అనే దళితుడుడిని బలి చేసి ఐదేళ్లపాటు జైలుపాలు చేసి ఆయన జీవితాన్ని నాశనము చేసింది జగన్ కాదా..? ఇప్పుడు 2024 ఎన్నికల ముందు గులకరాయి దాడితో బీసీ అనే మైనర్ బాలుడిని బలి చేయడానికి సిద్ధమయ్యారు అంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగన్ ఎన్నికలలో గెలవడానికి ఇలా ప్రతిసారి దళితులను, బీసీలను బలి చేస్తూ తన రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటున్నాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లు అంటే వైసీపీ కి ఇంత చులకన భావమా అంటూ పట్టాభి జగన్ వైఖరిని ఎండగట్టారు. అలాగే ఎన్నికల ప్రచారంలో నా ఎస్సీలు, నా బీసీలు అంటూ కలబుల్లి కబుర్లు చెపుతూ తన పదవులను నిలబెట్టుకోవడానికి అదే అణగారిన సామజిక వర్గాల పిల్లలను బలి చేయడానికి పూనుకున్నారు అంటూ కోడికత్తి శ్రీను, సతీష్ ల ఉదంతాన్ని వివరించారు పట్టాభి.
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…
Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…