Telugu

వైసీపీకి గమనిక: డీఎస్సీ అంటే ఉద్యోగాల భర్తీకి!

ఎన్నికలకు ముందు జగన్‌ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తే, అధికారంలోకి వస్తే డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పాయి కూటమి పార్టీలు. జగన్‌ అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో డీఎస్సీ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేత శాసనసభ లోపల బయటా కాకమ్మ కధలు చెప్పిస్తూ కాలక్షేపం చేసేవారు. ఎందుకంటే డీఎస్సీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న లక్షలాది యువతకి దానిని ఎరగా వేసి ఎన్నికలలో గెలవాలని దురాలోచన ఉన్నందునే. అందుకే ఎన్నికలకు ముందు హడావుడిగా డీఎస్సీ ప్రకటించారు. కానీ తాము మోసం చేస్తున్నామని నిరుద్యోగ యువత గ్రహించలేరని జగన్‌ భావించడమే ఎన్నికలలో వైసీపీ కొంప ముంచింది.

కానీ టీడీపీ ఎన్నికల సమయంలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కసరత్తు మొదలుపెట్టి నేడు ఏకంగా 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా ద్వారా ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్‌లో కూడా పెట్టారు.

ADVERTISEMENT

డీఎస్సీ షెడ్యూల్‌:

ఏప్రిల్ 20-మే 15 వరకు: దరఖాస్తుల స్వీకరణ

మే 20 నుంచి: నమూనా పరీక్షలు

మే 30 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌

జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు

జూలై 8 లేదా 9 న ప్రాధమిక కీ విడుదల

జూలై 15-16 తేదీల వరకు: అభ్యంతరాలు

జూలై 21-22 తేదీలలో ఫైనల్ కీ

జూలై 27-28 తేదీలలో అర్హత సాధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితా ప్రకటన.

డీఎస్సీ అంటే ఎన్నికల కోసమే అని జగన్‌ అనుకుంటే ఉద్యోగాల భర్తీకే అని సిఎం చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కనుకనే నేటి నుంచి మూడు నెలల్లోనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అర్హత సాధించిన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయాలని గడువు కూడా విధించారు.

కనుక ఈ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు, వివాదాలు, న్యాయ సమస్యలు, రాజకీయాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు.

వైసీపీ 5 ఏళ్ళలో చేయలేకపోయిన ఈ పనిని కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో పూర్తి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కనుక వైసీపీ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చుంటుందని అనుకోలేము.

దుష్ప్రచారాలు, కేసులు, కుట్రలు, అవరోధాలకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే దీని కోసమే ప్రత్యేకంగా ముఖ్య నేతలతో ఓ డిఫెండింగ్ టీమ్‌ ఏర్పాటు చేసుకొని వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంటేనే మెగా డీఎస్సీ ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

32 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

1 hour ago