
ఆ సమయంలో శాతకర్ణి (బాలకృష్ణ) జేబు నుంచి ఓ నాణెం కింద పడిపోతుంది. అదే నాణెంపై శ్రేయ కాలుమోపబోగా, అక్కడి మార్కెట్ లో మహిళా వ్యాపారి పాత్రలో నటిస్తున్న శమంతకమణి దాన్ని చూస్తారు. శ్రేయ ఆ నాణెంపై కాలు పెట్టే సమయంలో తన చెయ్యి పెట్టి అడ్డుకుంటారు. “కాలు తీయ్… మా దేవుడినే తొక్కుతావా?” అంటూ గద్దిస్తారు కూడా. ఆ నాణెం ‘శాతకర్ణి’ ముఖ చిత్రంతో ఉన్నదే కావడం విశేషం.
ఇలా రెండు నిమిషాల పాటు సాగే సన్నివేశంలో తాను నటించానని శమంతకమణి తెలిపారు. తన పాత్ర గురించిన మరిన్ని వివరాలు సినిమా చూస్తే తెలుస్తాయని ఎంతో సంతోషంతో చెప్పారు. అమరావతి చరిత్రతో కూడుకుని ఉన్న ఈ సినిమా కధలో చిన్న భాగస్వామి కావడం మంచి అనుభూతిని మిగిలించిందని అభిప్రాయపడ్డ శమంతకమణి, ఈ రోజు తిరుపతిలో జరగనున్న ఆడియో వేడుకలో కూడా ప్రత్యక్షం కానున్నారు.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…