Telugu

లోకేష్‌ని చూస్తే వైసీపీకి ఎందుకంత భయం?

శ్రీకాకుళం జిల్లా పలాసలో టిడిపి కార్యకర్త సూర్యనారాయణను పరామర్శించేందుకు వచ్చిన టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు శ్రీకాకుళం వద్ద అడ్డుకోవడంపై విజయనగరం జిల్లా టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. అనేకమంది విశాఖపట్నం విమానాశ్రయానికి తరలివచ్చి అక్కడ ధర్నా చేపట్టిన నారా లోకేష్‌కు సంఘీభావం తెలిపారు.

టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్రోత్తు బంగరాజు, తదితరులు విశాఖకు వచ్చి విమానాశ్రయం వద్ద ధర్నా చేసిన తమ నాయకుడు నారా లోకేష్‌కు సంఘీభావం తెలిపారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కవిటి కళావెంకటరావు మీడియాతో మాట్లాడుతూ, “పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ఆ పార్టీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్నారు. నారా లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతుండటంతో చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉన్న పోలీసులతో అడ్డుకొన్నారు. ఓ పార్టీ జాతీయ కార్యదర్శి తమ పార్టీ కార్యకర్తని పరామర్శించడానికి వెళుతున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అడ్డుకొంటున్నారు?దీనికీ మేము పోలీసుల అనుమతి తీసుకోవాలా? రేపు మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని అంటారేమో? వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, అందుకే ఇలా రెచ్చిపోతోంది. ప్రజలే డానికి తగిన గుణపాఠం చెపుతారు,” అని అన్నారు.

నెల్లిమర్లలో టిడిపి సీనియర్ నేత పతివాడ తమ్మినాయుడు, మాజీ ఎంపీపీ కండి చంద్రశేఖర్ రావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, మండల టిడిపి అధ్యక్షుడు కడగల ఆనంద్ కుమార్‌, కార్యదర్శి లెంక అప్పలనాయుడు తదితరులు ధర్నా చేశారు.

మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు అధ్వర్యంలో వానితోటలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పూసపాటిరేగకు చెందిన టిడిపి నేతలు పాల్గొని నారా లోకేష్‌ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, జిల్లా టిడిపి పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఆకిరి ప్రసాదరావు, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్‌ అధ్యక్షుడు పతివాడ తారాక రామానాయుడు , నియోజకవర్గంలోని టిడిపి నాయకులు పతివాడ తమ్మినాయుడు, ఇజ్జురోతు ఈశ్వరరావు, దంగా భూలోక, పిన్నింగ్ సన్యాసి నాయుడు, పిన్నింటి కిషోర్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwak’s #CULT Trailer: Thrills n Chills

Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…

12 minutes ago

Spirit Poster Trolls: Deepika Fans Target Vanga Again?

Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…

59 minutes ago