
గత ఐదేళ్ల తెలుగు తమ్ముళ్ల ఉక్రోషానికి, జనసైనికుల ఆవేశానికి న్యాయం కావాలంటూ, జగన్ అండ చూసుకుని, వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఉన్మాదులను, సోషల్ సైకోలను అరెస్టు చేయాలంటూ ఎక్కడిక్కడ కేసులు నమోదు చేస్తున్నారు కూటమి మద్దతుదారులు.
అయితే అప్పుడు అధికార పక్షం కనుసన్నలలో ముందు చూపు లేక ప్రతిపక్ష నేతల మీద రెచ్చిపోయిన శ్రీ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎవరి ధోరణిలో వారు తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులు వెతుకుతున్నారు.
ఒకరు తప్పయింది మహా ప్రభో….బుద్ది లేక అప్పుడు తలెగరేసా….ఇప్పుడు తల వంచుకుని క్షమించమని వేడుకుంటున్నా అంటూ దండాలు పెడుతూ, బహిరంగ లేఖలు రాస్తూ కాళ్ళ భేరానికి వచ్చారు.
అప్పుడు లకారాలతో మాట్లాడిన ఈ వైసీపీ ఉన్మాది ఇప్పుడు సార్, అన్నా అంటూ వేడుకుంటున్నా క్షమించేది లేదు అని తెగేసి చెపుతున్నటీడీపీ, జనసేన నేతల ప్రకటనలతో భయపడుతూ ఎప్పటికప్పుడు ప్రాంతాలను మారుస్తూ రహస్య ‘యాత్ర’లు చేస్తుంది శ్రీ రెడ్డి.
ఇక వైసీపీ ఆస్థాన దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ…వివాదాలతో కాకుండా గత ఐదేళ్లు విధ్వంసంతో స్నేహం చేస్తూ ఇతరులను కించపరిచేలా సినిమాలు తీస్తూ, వారి వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా నీచమైన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఒక దర్శకుడిగా సమాజం గురింపునిస్తే, ఆ సమాజాన్నే విధ్వంసం చేసే సినిమాలు తీసి తన స్థాయిని తానే పాతాళానికి పాడేసుకున్నారు ఆర్జీవీ.
గత ఐదేళ్లు జగన్ ను చూసుకుని రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ పై ఇప్పుడు కేసులతో రెచ్చిపోతున్నారు కూటమి నేతలు. ఇన్నాళ్ల తమ మానసిక వేదనకు కారణమైన ఈ ఉన్మాది పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఎక్కడిక్కడ టీడీపీ, JSP నేతలు కేసులు నమోదు చేస్తున్నారు. దీనితో తనకు రక్షణ కావాలంటూ కోర్ట్ మెట్లెక్కారు ఆర్జీవీ.
గత ఐదేళ్లు సోషల్ మీడియాలో కూర్చుని కారుకూతలు కూస్తూ, తనకు నచ్చినట్టల్లా వ్యూహం, శపథం అంటూ సినిమాలు తీస్తూ రాక్షసానందాన్ని పొందిన ఈ విధ్వంశకారి ఇప్పుడు రక్షణ కావాలంటూ కోర్టుల చుట్టూ ‘యాత్ర’లు చేస్తున్నారు. సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిసుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పోసాని ఒక క్యారెక్టర్ లెస్ వ్యక్తిగా మిగిలిపోయారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన గారు చంద్రబాబు, పవన్ ను ఉద్దేశించి మీడియాలోకి వచ్చి వాగిన వాగుడు, పవన్ కుటుంబంలోని మహిళలను, వారి పిల్లలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సమాజం కూడా సిగ్గుతో తల వంచింది. ఈ పిచ్చి వాగుడు వాగుతూ మెంటల్ కృష్ణ గా మిగిలిపోయిన పోసాని పిచ్చి వదిలించాలంటూ ఏపీ అంతటా పోసాని మీద కేసులు నమోదయ్యాయి.
వైసీపీ ప్రోత్సాహంతో, జగన్ ఆదేశాలతో అప్పుడు ముందు ఆలోచన లేకుండా వేసిన వీరి వెర్రి వేషాలకు భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు అంటూ టీడీపీ వేసిన ‘వ్యూహాలు’, జనసైనికులు పట్టిన ‘శపథాల’తో వైసీపీ ఉన్మాదులకు కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ ‘యాత్ర’లు చేయాల్సి పరిస్థితులు నెల్లకొన్నాయి.
Mamitha Baiju is going great guns in her career, with her recent films like Vishwanath…
Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…