
ఢిల్లీలో తాము ఎంజాయ్ చెయ్యడం లేదని, పార్లమెంటులో రాష్ట్రానికి లాభం కలిగేలా పని చేస్తున్నామని, ఎన్డీయేకు మిత్రపక్షమైనా తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడుతున్నామని అన్నారు. హోదా ప్రకారం అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రంతో పాటు కేంద్రం 40:60 నిధులు వెచ్చించాలని, కానీ ఇప్పుడు 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని తెలిపారు. జల్లికట్టుతో ప్రత్యేక హోదాను పోల్చడం వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఈ సందర్భంగా కోరారు.
తాను గత 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, అందువల్ల తనకు అప్పు తీసుకునే హక్కు ఉందని, ఈ 30 ఏళ్లలో ప్రభుత్వానికి సేల్స్, ఎక్సైజ్, ఇంకా ఎన్నో ట్యాక్సులు కట్టానని, ఆ క్రమంలో ఇన్నేళ్లలో ఎవరూ తనను ప్రశ్నించలేదని చెప్పారు. పారిశ్రామిక వేత్త ఎవరైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీలు చెల్లించడం ఒక రోజు ముందు లేదా వెనుక అవుతుందని, దానిని చీప్ గా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. అలా కాకుండా తాము ఎవరికైనా ఒక్క రూపాయి అన్యాయం చేశామని తేలితే అప్పుడు ప్రశ్నించాలని, ఆర్ధిక నేరాలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరని గుర్తించాలని ఈ సందర్భంగా కోరారు.
వ్యక్తిగత విమర్శల వల్ల ఇతరులపై గౌరవం పోతుందని, రాజకీయాలు, వ్యాపారం వేరుగా చూడాలని సూచించారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో తాను వ్యాపార లబ్ధి పొందలేదని, తాను తప్పులు చేశానని ఎవరైనా నిరూపిస్తే ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇకపై ఎవరైనా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన సుజనా, తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నామని, అలాంటి తమపై అరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…