
వైసీపీ నాయకులు గరికిపాటి నరసింహారావు తనని వేధిస్తున్నాడని పిర్యాదు చేసినా, అక్కడి అధికారులు ఆ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే నాగలక్ష్మి కుటుంబానికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు అనిత. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న ఈ అన్యాయాల గురించి మాట్లాడడానికి వైసీపీలో ఉన్న మహిళా నేతలకు నోరు రావడం లేదా అంటూ నిలదీశారు.
సాక్షాత్తు హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికి ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా కరువైందని, దిశా చట్టం క్రింద నేరం చేసిన వారం రోజులలోనే నిందితుడికి శిక్ష ఖరారు అంటూ భారీ ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అంటూ జగన్ పై ఘాటైన ప్రశ్నలే సంధించారు టీడీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత.
గడిచిన రెండు రోజుల నుండి ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలు వైసీపీ నాయకులను., మంత్రులను విమర్శలతో చీల్చి చెండాడుతున్నారనేది మీడియా సాక్షిగా ప్రజానీకం వీక్షిస్తూనే ఉంది. ‘బీబీ’ మంత్రి అంటూ కొడాలి నానిని ఉద్దేశించి దివ్యవాణి ఓ రేంజ్ లో పంచ్ డైలాగ్స్ పేల్చారు. ‘బీబీ’ అంటే ‘బూతులు – బేవార్స్’ అనే అర్ధం అంటూ.., సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసి మంత్రి అంటూ ఘాటు విమర్శలు చేసారు.
బీజేపీని ప్రశ్నించాలని చంద్రబాబు, పవన్ లను డిమాండ్ చేస్తోన్న పేర్ని నానిని ‘కేంద్రాన్ని అడిగే మగతనం మీ పార్టీ నాయకులకు లేదా? అని మేము కాదు ప్రజలనుకుంటున్నారని’ దివ్యవాణి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా నేతలకు తమ వంతు గళం వినిపించారు జనసేన వీర మహిళలు. మగతనాల గురించి మాట్లాడిన సన్నాసి మంత్రులు మీ మగతనం రాష్ట్ర అభివృద్ధిలో చూపించండన్నా.., అంటూ కొడాలి నానికి గట్టి కౌంటర్ వేశారు జనసేన మహిళా నేత అరుణ.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన ఒక్క ప్రకటనకు ప్రతిస్పందించిన ఈ వైసీపీ నాయకులు “ఈ రాష్ట్రంలో జగన్ ఎదిరించే మగాడు ఎవ్వరు లేరని” ప్రగల్భాలు పలికిన ఫలితమే ఇప్పుడు వీరు ఎదుర్కుంటున్న ఈ ముప్పేట దాడి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
The Andhra Pradesh State Election Commission has announced the schedule for MPTC and ZPTC elections,…
Ramayana has crossed $820K in overseas advance bookings, and now the focus shifts to India.…