Telugu

గుడివాడ ఫ్లెక్సీ వివాదం..

కృష్ణా జిల్లాలో భాగమైన గుడివాడ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండిపోయేలా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే గత పదేళ్లుగా ఆ నియోజకవర్గం వైసీపీ ఫ్యాన్ కింద కొడాలి నాని బూతు రాజకీయాలతో నలిగిపోయింది.

అయితే 2024 లో కూడా తమదే విజయం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, వై నాట్ 175 అంటూ రెచ్చిపోయిన వైసీపీ, కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి బాబు షూ పాలిష్ చేస్తా, ఆయన కాళ్ళ దగ్గర పడుంటా అని సవాల్ విసిరారు కొడాలి నాని.

ADVERTISEMENT

ఇప్పుడు ఆ సవాలే తిరిగి టీడీపీ, వైసీపీ మధ్య మరో వివాదానికి దారి తీసింది. నాడు సవాళ్ళతో రెచ్చిపోయావ్ నేడు ఓడిపోయి ఎక్కడికి పారిపోయి దాక్కున్నావ్ అంటూ కొడాలి, బాబు షూ పాలిష్ చేస్తున్నట్టుగా ఉన్న ఫ్లెక్సీ ఒకటి గుడివాడలో వెలిసింది.

దానికి తోడు బాబు టార్గెట్ గా వైసీపీ నేతలు పెట్టిన “బాబు షూరిటీ…మోసం గ్యారెంటీ” ఫ్లెక్సీ కూడా ఈ రెండు పార్టీల వివాదానికి ఆజ్యం పోసింది. వైసీపీ నేతలు పెట్టిన ఈ ప్లేక్సి ని చించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా, టీడీపీ శ్రేణులు పెట్టిన ఆ పోస్టర్ ను చించేందుకు వైసీపీ యత్నించింది.

దీనితో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే రెండు పార్టీల కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. నాడు కొడాలి చేసిన అతికి నేడు టీడీపీ శ్రేణులు చేస్తున్న చర్యలు సహేతుకమే అనే ఆవేదన కూడా గుడివాడ లో వినిపిస్తుంది.

గత పదేళ్లుగా గుడివాడ ఎమ్మెల్యే ఉన్న కొడాలి గుడివాడలో టీడీపీ జెండా ఎగరకుండా, టీడీపీ కార్యక్రమాలు జరగకుండా ప్రతి అడుగులోనూ అడ్డుపడ్డారు. తన అధికారంతో ప్రతి టీడీపీ కార్యకర్త సహనాన్ని పరీక్షించారు. నేడు ఓటమి పలకరించగానే నియోజకవర్గాన్ని వదిలి పెట్టి పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా వలస పక్షి మాదిరి తిరుగుతున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

5 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

6 hours ago