టిడిపి మెతక వైఖరే కొంపముంచిందా?

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డిని, ఆ పార్టీ దౌర్జన్యపూరిత రాజకీయాలను, కుయుక్తులను టిడిపి మొదటి నుంచి నిశితంగా గమనిస్తూనే ఉంది. కనుక వైసీపి వంటి నేరపూరిత లక్షణాలున్న పార్టీని ఎదుర్కోవాలంటే కేంద్రం సహాయసహకారాలు అవసరమని భావించి, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు బీజేపీతో పొత్తుల కోసం ఎదురుచూశారు.

మోడీ, అమిత్ షాలు కూడా ఒకవైపు జగన్మోహన్‌ రెడ్డికి అన్నివిధాలా సహకరిస్తూనే చంద్రబాబు నాయుడుని మభ్యపెడుతూ చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో కూడా భేటీ అవుతూ ఆయనని కూడా గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఈవిదంగా ఏపీలో మూడు ప్రధాన పార్టీలను గుప్పెట్లో పెట్టుకొని ఏపీ రాజకీయాలను ఢిల్లీ నుంచి శాశిస్తున్నారు.

ADVERTISEMENT

అయినా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు బీజేపీ పెద్దలపై ఎటువంటి సందేహమూ కలగలేదు. వారిపై నమ్మకం కోల్పోలేదు. ఇదే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇప్పుడు టిడిపి, జనసేనలు పుంజుకొంటున్నప్పుడు ఎన్నికలకు ముందు వాటిని వైసీపి దెబ్బతీస్తుంటే మోడీ, అమిత్ షాలు మౌనం వహిస్తుండటం చూస్తే, వారి రాజకీయ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో ఎలాగూ బీజేపీకి ప్రజాధరణ, బలం లేదు కనుక ముందుగా టిడిపి, జనసేనలను వైసీపి కోలుకోలేని విదంగా దెబ్బతీసుకొనేలా చేశారు.

వారు టిడిపి వైపు ఎందుకు మొగ్గలేదంటే చంద్రబాబు నాయుడు కంటే అవినీతి కేసులు, అప్పుల కోసం తమ దాయాదాక్షిణ్యాలపై ఆధారపడి తమకు ఎల్లప్పుడూ విధేయంగా ఉండే జగన్మోహన్‌ రెడ్డి అయితేనే మంచిదని వారు భావించి ఉండవచ్చు. అందుకే ఆయన ఇంతగా చెలరేగిపోతున్నా, ఇప్పుడు టిడిపిని తుడిచిపెట్టేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నా మోడీ, అమిత్ షాలు నిద్ర నటిస్తున్నారనుకోవచ్చు.

తమ చేతికి మట్టి అంటకుండా టిడిపి, జనసేనలని వైసీపి తుడిచిపెట్టేశాక, ఆక్రమాస్తులు, అవినీతి కేసులో జగన్మోహన్‌ రెడ్డిని, వైసీపి నేతలను లోపల వేసి వైసీపిని తుడిచిపెట్టేయడం కేంద్రానికి పెద్ద సమస్య కాదు.

లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొన్న కల్వకుంట్ల కవితని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్‌ పార్టీని కేంద్రం నియంత్రిస్తున్నట్లే, ఇక్కడ ఏపీలో కూడా టిడిపి, వైసీపిలను నియంత్రిస్తున్నట్లు భావించవచ్చు. అంటే అక్కడ బిఆర్ఎస్‌తో, ఇక్కడ వైసీపితో లోపాయికారి అవగాహన కుదుర్చుకొన్నట్లు భావించవచ్చు.

కనుక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఈ ఉచ్చులో నుంచి బయటపడి ‘ఇండియా’ వైపు అడుగులు వేయడం మంచిది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

GV Prakash Kumar Impressed with Chakkora’s Dam Dam

The second single from Chakkora – Lunar Love Bird, “Dam Dam,” has been released with…

3 minutes ago

అప్పుడూ ఇలాగే కళ్ళు మూసుకోమన్నారు…

అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీలైనా తమ మనసులో ఆలోచనలు, కోరికలనే ప్రజలకు ఆపాదిస్తూ వాటిని ప్రజాభిప్రాయంగా అభివర్ణిస్తుంటాయి. అధికార…

11 minutes ago