
కాన్పూర్ టెస్టు మాదిరే కోల్ కతా టెస్టులోనూ సునాయాస విజయాన్ని అందుకుంది. వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ప్రారంభించి, బ్యాటింగ్, బౌలింగ్ లో గట్టి పోటీ ఇచ్చింది. తొలి టెస్టులో అశ్విన్, జడేజాలు భారత్ కు విజయాన్ని కట్టబెడితే, రెండో టెస్టులో భువనేశ్వర్ కుమార్, షమీ టీమిండియాకు విజయాన్ని బహుమతిగా అందజేశారు. 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు కేవలం 197 పరుగులకే ఆలౌట్ కావడంతో 179 పరుగుల తేడాతో టీమిండియా రెండో టెస్టును కైవసం చేసుకుంది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో తన సొంతం చేసుకుని, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.
భారత్ సాధించిన ఘన విజయంతో ఇప్పటివరకు 111 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా (108 పాయింట్లు), నాలుగో స్థానంలో ఇంగ్లండ్(108), ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా(108), ఆరో స్థానంలో శ్రీలంక(96) ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా – పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపధ్యంలో పాక్ ను క్రిందకు దించడం పట్ల భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…