Telugu

టీజర్స్ – ‘కత్తి’ బాగుందా… ‘ఖైదీ’ బాగుందా..?

వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఖైదీ నంబర్ 150” సినిమా, మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన “కత్తి” సినిమా రీమేక్ అన్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమాగా ఓ రీమేక్ ను ఎంపిక చేసుకోవడంతో “కత్తి”పై టాలీవుడ్ వర్గాల కళ్ళు పడ్డాయి. తాజాగా మెగాస్టార్ మొదటి టీజర్ విడుదల కావడంతో, ఈ రెండు టీజర్ లలో ఏది బాగుంది అన్న టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మెగా అభిమానులను మినహాయిస్తే… మిగతా అందరి ఓటు మురుగదాస్ – విజయ్ ల “కత్తి”కే పడుతోంది. మరో విశేషమేమిటంటే… పెద్ద మార్పులు లేకుండానే చిరు “ఖైదీ నంబర్ 150” సిద్ధమవుతోందన్న సంకేతాలు కనపడ్డాయి. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో విజయ్ “కత్తి” సూపర్ సక్సెస్ కావడంతో, సరిగ్గా అదే షాట్లను “ఖైదీ”లో రిపీట్ చేయడంతో, ఒరిజినల్ చూసిన వారిని పెద్దగా సంతృప్తి పరచడంలో “ఖైదీ” విఫలమైంది.

ADVERTISEMENT

అలాగే “కత్తి” టీజర్ కు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉండగా, దానిని మక్కికి మక్కి కాకపోయినా కొంతమేరకు దేవిశ్రీ కాపీ చేసాడన్న టాక్ వినపడుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా “ఖైదీ” కన్నా “కత్తి”నే ముందు వరుసలో ఉంది. మొత్తమ్మీద “కత్తి” చూసిన వాళ్ళకు “ఖైదీ” పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయడం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KTR Following Jagan’s Track Before Election?

The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…

9 minutes ago

ఓ కాళేశ్వరం… ఓ పోలవరం!

గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…

16 minutes ago