
హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ ఆ స్థాయిని తగ్గించకుండా తన తదుపరి చిత్రం మిరాయ్ ని సిద్ధం చేసినట్లుంది. నీ స్థాయికి ఈ స్థాయి సినిమాలు అవసరమా అంటూ ఎద్దేవా చేసిన వారికీ ఇది నా స్థాయి అని హనుమాన్ తో సమాధానం చెప్పిన తేజ అదే స్థాయిని కొనసాగిస్తూ మిరాయ్ తో మరోసారి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టిని తన సినిమా పై పడేలా చేసుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి, హనుమాన్ తో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. జాంబీ రెడ్డి తో హీరోగా అరంగేట్రం చేసిన తేజ తన మొదటి సినిమాతోనే తన కథల ఎంపిక తీరుని ప్రేక్షకుల ముందుంచారు. ఓ బేబీ, జాంబీ రెడ్డి, అద్భుతం, ఇష్క్, హనుమాన్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తేజ దేనికదే భిన్న కథలతో ఆకట్టుకున్నారు.
ఇందులో హనుమాన్ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసి పాన్ ఇండియా విజయాన్ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీలో పెద్ద సౌండ్ చేసింది హనుమాన్. ఇండస్ట్రీలో హిట్ కొట్టడం కాదు ఆ విజయాన్ని కొనసాగించడం మరింత కష్టం అనే టాక్ గట్టిగ నడుస్తూ ఉంటది. మరి మిరాయ్ తో తేజ సజ్జా ఆ విజయ పరంపరను కొనసాగించేలానే కనిపిస్తుంది.
ఒక స్టార్ హీరో సినిమా స్థాయి విజువల్స్ తో మిరాయ్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనగనగ ఓ సామ్రాట్ అంటూ మొదలైన గ్లిమ్స్ లో గ్రహణాన్నిఆపే ఒక జననం, ఇది తరాలుగా తప్పని మహా రణం…అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గ్లిమ్స్ లో హై లెట్ గా నిలిచింది. పీపుల్స్ ఫ్యాక్టరీ మీడియా సంస్థ నిర్మాణంలో, ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఏప్రిల్ 18 , 2025 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రానుంది మిరాయ్.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…