
జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హను MAN విడుదలైన నాలుగు రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరి అరుదైన రికార్డు ని నెలకొల్పింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ “ఇది నా తొలి సెంచరీ” అంటూ X వేదికగా స్పందించారు.
మహేష్ వంటి స్టార్ హీరో సినిమాని తట్టుకుని, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల సినిమాలకు ఎదురునిలిచి హనుమాన్ వంద కోట్ల క్లబ్ లోచేరడం చిన్న సినిమాలకు, యువ దర్శకుల అభిరుచులకు శుభపరిణామమనే చెప్పాలి. సినిమాను కరెక్టుగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలిగితే లిమిటెడ్ బడ్జెట్ తో, చిన్న హీరోలను పెట్టి కూడా యువ దర్శకులు మంచి విజయాన్ని సాధించగలరు అనేది హనుమాన్ కి వస్తున్న కలెక్షన్లను చూస్తే అర్ధమవుతుంది.
సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ సినిమా విడుదలైన మొదటి వారం రోజులలోనే వెనక్కి రాబట్టాలని, పెరిగిన బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడానికి టికెట్ ధరలను పెంచి తమ సినిమా కలెక్షన్లను ప్రమోట్ చేసుకునే నయా ట్రెండ్ లో సినిమా టికెట్ ధరలు పెంచకుండా, లిమిటెడ్ థియేటర్లలో సినిమాను రన్ చేస్తూ ఈ రకమైన వసూళ్ల రికార్డులు సాధించడం అంటే నిజంగా తన సినిమా పై ప్రశాంత్ వర్మ కు ఉన్న నమ్మకాన్ని అభినందించాల్సిందే.
సినిమా ప్రమోషన్ లో కూడా స్టార్ కాంపైనర్ అంటూ ఎవరు లేకపోయినప్పటికీ హనుమంతుల వారినే స్టార్ కాంపైనర్ చేసుకుని ముందుకెళ్లిన చిత్ర యూనిట్ కు ప్రేక్షకులతో పాటుగా ఆ శ్రీ రాముడి ఆశీస్సులు కూడా పుష్కలంగా అందినట్టుంది.
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…
Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…