తెలంగాణలో బీజేపీ ఓడిపోతే ఏపీలో గెలవగలదా?

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి అధికారంలోకి రావాలని ఇంతకాలం బీజేపీ చాలా పట్టుదలగా పనిచేసింది. నేటికీ పనిచేస్తూనే ఉంది.

ADVERTISEMENT

కానీ తెలంగాణలో అకస్మాత్తుగా బీజేపీలో లుకలుకలు మొదలయ్యి బండి సంజయ్‌ని మార్చవలసి రావడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం, బిఆర్ఎస్ పార్టీ మరింత నమ్మకంగా దూకుడుగా ముందుకు సాగుతుండటంతో రెండో స్థానంలో ఉన్న బీజేపీ మూడో స్థానంలోకి జారుకొంది.

తెలంగాణలో ఎంతో బలం కలిగి, అధికారం చేజిక్కించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించినా కూడా బీజేపీ ఓడిపోయిన్నట్లయితే, ఏపీలో బలం, ప్రజాధరణ రెండూ లేని బీజేపీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది?వాటిలో ఎన్ని సీట్లు గెలుచుకోగలదు? అనే సందేహం కలుగక మానదు.

తెలంగాణలో బీజేపీని గెలిపించుకోవాలని మోడీ, అమిత్ షాలు అనుకొన్నారు. ఆ దిశలో గట్టి ప్రయత్నాలు చేశారు కూడా. కానీ చివరికి బిఆర్ఎస్ పార్టీకి మేలు కలిగేవిదంగా వ్యవహరించి బీజేపీని దెబ్బ తీసుకొన్నారు. అది వేరే విషయం.

కానీ వారిరువురూ ఏపీలో బీజేపీని పట్టించుకొన్న దాఖలాలే లేవు. చివరికి దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించి ఏపీలో బీజేపీని నిద్రలేపబోతున్నారనే భావన కల్పించారు కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మౌనం వహిస్తూ జగన్‌ పక్షాన్న నిలబడటంతో మళ్ళీ ఏపీ బీజేపీకి మళ్ళీ ‘స్లీపింగ్ టాబ్లెట్’ వేసేశారు.

ఇప్పటికే ఏపీ బీజేపీ పలు అంశాలపై ఆంధ్రా ప్రజలకు జవాబు చెప్పుకోలేని దుస్థితిలో ఉండగా, ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారని చెప్పక తప్పదు. కనుక ఏపీ బీజేపీని ఇక పవన్‌ కళ్యాణ్‌ కూడా కాపాడలేకపోవచ్చు.

ఒకవేళ బీజేపీని జనసేన వదులుకొన్నా లేదా బీజేపీయే జనసేనను వద్దనుకొన్నా బీజేపీ, వైసీపితో బహిరంగంగా పొత్తులు పెట్టుకోలేదు. అందుకు వైసీపి అంగీకరించదు కూడా. కనుక ఏపీలో ఒంటరిగా బీజేపీ మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ చేతిలో బీజేపీ ఓడిపోతే, మోడీ, అమిత్ షాలు ఏపీకి రాగలరా? వచ్చినా బీజేపీకి ఓట్లు వేసి గెలిపించమని అడగగలరా?అడిగినా ప్రజలు ఓట్లు వేస్తారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

27 minutes ago

Vijay Deverakonda vs Rajni: Can Ranabaali Make It 3-0?

Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…

57 minutes ago