
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ… పంచాంగకర్త సంతోష్ కుమార్ చెప్పిన ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నవ్వుతూ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నాడు సరదాగా చేసిన వ్యాఖ్యలే నేడు సీరియస్ రూపం సంతరించుకోవడం విశేషం. తాజా ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తరువాత, నాటి పంచాంగ శ్రవణం నిజమైందని ఈ సందర్భంగా పలువురు విశ్లేషిస్తున్నారు.
ఆనాటి వీడియో క్లిప్పింగ్స్ లో పంచాంగకర్త సంతోష్ వ్యాఖ్యలను, కేసీఆర్ హెచ్చరికలను చూపిస్తూ, టీవీ చానళ్లలో ఇప్పుడు ప్రత్యేక కధనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా, ఎంసెట్-2 నిర్వహణ బాధ్యతలు తమవి కావంటే తమవి కావని అటు విద్యా శాఖ మంత్రి, ఇటు ఆరోగ్య శాఖా మంత్రులు చెబుతుండటం గమనార్హం. విద్యార్ధులు మాత్రం మరోసారి ఎంసెట్ రాసేందుకు ససేమీరా అంటున్నారు. జ్యోతిష్యం నమ్మకం లేని వారికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పంచాంగ నమ్మకస్తులు
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…