తెలంగాణలో రాజకీయ సమీకరణాలు… ఏపీలో ఎలా ఉంటాయో?

తెలంగాణ శాసనసభ ఎన్నికలను చూస్తున్నప్పుడు, రేపు ఆంధ్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏవిదంగా జరుగుతాయో అనిపించక మానదు. జరుగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే అని జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా డిక్లేర్ చేశారు. అది నిజం కూడా.

నాలుగున్నరేళ్ళుగా టిడిపి, జనసేనలను వైసీపి ప్రభుత్వం వేధిస్తున్నందుకు వారు ఇంతకింతా ప్రతీకారం తీర్చుకొంటామని శపధాలు చేస్తున్నారు. కనుక ఈ ఎన్నికలలో వైసీపి గెలవకపోతే జగన్మోహన్‌ రెడ్డితో సహా ఆ పార్టీ నేతల జీవితాలు దుర్భరంగా మారిపోతాయి.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో టిడిపి, జనసేనలు గెలవలేకపోతే మరో ఐదేళ్ళ వరకు వైసీపిని తట్టుకొని మనుగడ సాగించడం కష్టం. కనుక వాటికీ రాబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివే అని చెప్పొచ్చు.

తెలంగాణలో కేసీఆర్‌ రెండు బలమైన జాతీయపార్టీలను ఎదుర్కొని పోరాడుతున్నారు. కానీ ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీలు బలహీనంగా ఉండటం జగన్‌ అదృష్టమే అనుకోవాలి. ఒకవేళ అవి కూడా బలంగా ఉండి ఉంటే జగన్మోహన్‌ రెడ్డి అప్పుడు టిడిపి, జనసేనలతో పాటు వాటితో కూడా పోరాడవలసి వచ్చేది. అప్పుడు ఆయన చెప్పుకొంటున్న తోడేళ్ళ గుంపు ఇంకా పెద్దదయ్యేది.

తెలంగాణలో తాజా రాజకీయ సమీకరణాలతో ఏపీలో సమీకరణాలు కూడా మారవచ్చు. తెలంగాణలో బీజేపీకి మద్దతుగా జనసేన ముందుకు వస్తే, కాంగ్రెస్‌కు మద్దతుగా టిడిపి వెనక్కు తగ్గింది.

కాంగ్రెస్‌ పార్టీని టిడిపి, జనసేనలకు దూరంగా ఉంచేందుకైనా బీజేపీ వాటితో కలవవచ్చు. ఒకవేళ ఈ మూడూ కలిస్తే వాటిని ఎదుర్కోవడం వైసీపికి కష్టమవుతుంది.

ఒకవేళ టిడిపితో కలిసేందుకు బీజేపీ ఇష్టపడకపోతే కాంగ్రెస్‌ వచ్చి కలవవచ్చు లేదా పరోక్షంగా టిడిపికి సహకరించవచ్చు. అప్పుడు బీజేపీ వైసీపికి పరోక్షంగా సహకరించవచ్చు. కనుక జనసేనతో పాటు బీజేపీ వచ్చి టిడిపితో కలుస్తుందా లేక కాంగ్రెస్‌ వచ్చి కలుస్తుందా? అనేది డిసెంబర్‌ 3 తర్వాత తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Haiwaan: Just 2.7K Tickets Sold, Akshay Fans in Shock?

Haiwaan is finally releasing in theatres on September 11, 2026. Marking the return of Priyadarshan…

16 minutes ago

Big Leaders Going, But Jagan Not Bothered?

YS Jagan had been very stern about his principle that his YCP runs entirely on…

36 minutes ago