Telugu

డిసెంబర్‌ 9న ప్రమాణస్వీకారమా… చేయనిస్తారా?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ తమ తమ నియోజకవర్గాలలోనే ఎన్నికల ప్రచారం చేసుకొంటుంటే, కొడంగల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ కూడా ఇలాగే చేస్తున్నారు. అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి కోరుకొనే ఏ నాయకుడైనా ఈవిదంగానే చేయాలి.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంత ఒత్తిడి, ఇంత బాధ్యత తీసుకోవడానికి ఏ సీనియర్ నాయకుడు సిద్దంగా లేనప్పటికీ, కాంగ్రెస్‌ గెలిస్తే మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకొనేవాళ్ళు ఓ అరడజను మందికి పైగానే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ సీనియర్ నేత, అలాగే పార్టీకి వెన్నుపోటు పొడుస్తుండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవుతానని పదేపదే చెప్పుకొంటుంటారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌లో ఇంకా చాలా మంది మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకొంటున్నప్పటికీ రేవంత్‌ రెడ్డి ఏనాడూ వారించలేదు. కనీసం స్పందించలేదు. కానీ ఇవాళ్ళ తొలిసారిగా నిర్మల్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ “డిసెంబర్‌ 9వ తేదీన నేను బాధ్యతలు చేపట్టబోతున్నాను. వెంటనే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాను,” అని ప్రకటించారు.

‘కలహాలు అంటే ప్రణయ కలహాలని అర్ధం’ అన్నట్లు ‘బాధ్యతలు చేపట్టబోతున్నాను’ అంటే ‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాను’ అనే అర్దం.

కేసీఆర్‌ దెబ్బలకు నిద్రాణస్థితిలోకి జారుకొన్న కాంగ్రెస్ పార్టీని నిద్రలేపి ఇవాళ్ళ బిఆర్ఎస్ పార్టీని ఢీకొని ఓడించగలమనే స్థాయికి తీసుకువచ్చి నిలబెట్టిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హత సాధించిన్నట్లే భావించవచ్చు.

కానీ అంతకంటే ముందు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా?గెలిచినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి జారుకోకుండా ఉంటారా?ఉన్నా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతానంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర సీనియర్లు అంగీకరిస్తారా?అనే ప్రశ్నలకు డిసెంబర్‌ 3 నుంచి 9లోగా అన్ని సమాధానాలు తప్పక లభిస్తాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

3 hours ago

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

3 hours ago