
తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చిలికి చిలికి గాలివాన మాదిరి ప్రభుత్వం మెడను చుట్టుకుంటున్నాయి. గతంలో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ హైడ్రా తో ముందుకొచ్చిన రేవంత్ సర్కార్ పేద, మధ్య తరగతి ప్రజల ఆగ్రహానికి గురయ్యింది.
అటు న్యాయస్థానాల నుంచి కూడా హైడ్రాకు మొట్టికాయలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బిఆర్ఎస్ లు హైడ్రా తో హైద్రాబాద్ ఇమేజ్ ను రేవంత్ సర్కార్ కూల్చివేస్తుంది, పేదవాడి సొంత ఇంటి నిర్మాణాలను కళ్ళ ముందే సమాధి చేస్తున్నారు అంటూ ప్రభుత్వం పై ఎదురుదాడికి దిగాయి.
అయితే అటు ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకత, ఇటు ప్రతిపక్షాల నుండి ఎదురైనా విమర్శలతో హైడ్రా కు బ్రేకులు వేసింది రేవంత్ సర్కార్. ఇక ఇప్పుడు కంచ గచ్చిబౌలి లో 400 ఎకరాల భూమి ప్రభుత్వం వేలం వేయడానికి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై కూడా ఇదే స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇప్పుడు రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై వివాదాలు చుట్టూ ముట్టాయి. ఈ భూమి మాదే అంటూ అటు HCU విద్యార్థుల ఆందోళన ఒకపక్క, తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతుంది, ‘సేవ్ హైద్రాబాద్’ అంటూ విపక్షాలు మరోపక్క, అసలు కంచ గచ్చిబౌలి లో ఏంజరుగుతుందో నివేదిక కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టూ ముట్టారు.
పచ్చటి అరణ్యాన్ని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థల పరం చేయడం అన్యాయమంటూ రేవంత్ సర్కార్ పై తెలంగాణ సమాజం గొంతెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా అసలు ఈ 400 ఎకరాల భూమి పై HCU విద్యాసంస్థకు ఎలాంటి సంబంధం ఉందంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రుల భేటీ అయ్యి పూర్తి సమాచారాన్ని సేకరించారు.
విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, విద్యార్థులు భయపడుతున్నట్టు ఈ భూమి అటు అటవీ ప్రాంతము కాదు, ఇది ఎవరి ప్రయివేట్ ప్రాపర్టీ కాదు, ఈ భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించేందే అంటూ వెనకడుగు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత గా లేదు.
దీనితో అటు నిరసనకు దిగిన HCU విద్యార్థుల పై పోలీసులు లాఠీలకు పని చెపుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కనీసం ఆడపిల్లల్నే విచక్షణ కూడా లేకుండా పోలీస్ బాసులు మా పై లాఠీ జుళిపిస్తున్నారంటూ HCU విద్యార్థినిలు ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, పైడ్ ఆర్టిస్టుల ప్రదర్శన అంటూ ప్రభుత్వ పెద్దలు ఈ నిరసన కార్యక్రమాలను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు నిరశన కారులు కానీ తగ్గేదెలా అన్నట్టుగా మొండిగా ఎవరి వాదనతో వారు పోరాటానికి సిద్ధమయ్యారు.
మరి ఈ పోరాటంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక ఆందోళనకారులు ప్రభుత్వ పెద్ద సూచనకు తలవంచుతారా అనేది వేచి చూడాలి.
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…
Andhra Pradesh chief minister Chandrababu Naidu is currently serving his fourth term in the office…