
తెలంగాణలో మెట్రో విస్తరణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలయ్యింది. మెట్రో పనులకు మీరు పిల్లర్ లా అడ్డుపడుతున్నారంటే మీరు అడ్డుపడుతున్నారంటూ అధికార కాంగ్రెస్ విపక్ష బీజేపీ ఒకరి మీద మరొకరు నిందలు వేసుకుంటున్నారు.
ఇక గత పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం మెట్రో విస్తరణ కూడా జరగడం లేదని, కాంగ్రెస్ పాలన హైడ్రా పాలన, కేవలం కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చేతకావని రేవంత్ సర్కార్ పై మాటల తూటాలు వదులుతుంది.
అసలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లనే కేంద్రం నుంచి రావలసిన రూ. 13600 కోట్ల మెట్రో ఋణం ఆగిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మెట్రో పనులు పూర్తి చేస్తే అది బీజేపీ, బిఆర్ఎస్ కి రాజకీయంగా లబ్ది చేకూరదనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి ఈ మాదిరి మెట్రో పనులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు.
అలాగే గత ఎన్నికలలో బీజేపీ నేతల గెలుపు కోసం బిఆర్ఎస్ రాజకీయంగా సహకరించిందని, దానికి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా బీజేపీ, బిఆర్ఎస్ రాజకీయ క్షేమం కోసం మెట్రో పనులకు అడ్డుగోడల మారిందంటూ కాంగ్రెస్ vs బీజేపీ గా మెట్రో మంటలు అంటుకున్నాయి.
ఇక మెట్రో రెండవ దశ పనుల విస్తరణ విషయంలో రేవంత్ సర్కార్ విఫలమయ్యిందని, కేంద్ర పరభుత్వం నుంచి ఋణాలు పొందలేక ఆ నేరం బిఆర్ఎస్ మీద వేసి రేవంత్ చేతులు దులుపుకోవాలని చూడడం హాస్యాస్పదమని, ఇది ఆయన అసమర్ధ పాలనకు నిదర్శనమంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
అయితే హైద్రాబాద్ లో మెట్రో పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఋణం రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో ఈ మూడు పార్టీల మధ్య మెట్రో రగడ మొదలయ్యి చివరికి అది ఏపీలోని విశాఖ వరకు వచ్చి చేరింది.
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ఉన్నంత పరిధి లో ఉండే విశాఖకు మెట్రో అనుమతులు దక్కుతున్నాయి కానీ హైద్రాబాద్ కి కేంద్రం నుంచి మెట్రో అనుమతులు దక్కడం లేదని, ఇది ఖచ్చితంగా తెలంగాణ పై కేంద్రం చూపిస్తున్న వివక్షగానే పరిగణించాలంటూ సీఎం రేవంత్ విశాఖ మెట్రో ను తెరమీదకు తెచ్చారు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…