
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి విడదల రజనీ, ఆమె మరిది గోపీ, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణ, విజిలెన్స్ అధికారి పల్లె జాషువా నలుగురు కలిసి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేసినందుకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
సరిగ్గా ఇదేవిదంగా తెలంగాణలో కూడా జరిగింది. అయితే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రషర్ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేయడమే విశేషం.
హనుమకొండకు చెందిన కట్టా మనోజ్ అనే వ్యక్తికి హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఓ గ్రానైట్ క్వారీ ఉంది. అది తన పరిధిలో ఉంది కనుక రూ.25 లక్షలు చెల్లించాలని బెదిరించి పాడి కౌశిక్ రెడ్డి వసూలు చేసుకున్నారు. మళ్ళీ ఈ నెల 18న మరోసారి ఫోన్ చేసి ఈసారి రూ.50 లక్షలు ఇవ్వాలని లేకుంటే కుటుంబ సభ్యులతో సహా అందరినీ చంపేస్తానని బెదిరించారని బాధితుడి భార్య కట్టా ఉమాదేవి వరంగల్ సుబేదారీ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
ఆమె సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు సమర్పించడంతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాపారులను ఈవిదంగా బెదిరిస్తున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరెంతగా చెలరేగిపోయేవారో కదా అనిపిస్తుంది. ఈ లెక్కన బిఆర్ఎస్ పార్టీ నేతల కంటే మన వైసీపీ నేతలే బెటర్ అనుకోవాలేమో?
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…