
రాష్ట్ర విభజన: బీఆర్ఎస్ పార్టీకి వరమా శాపమా? అంటే ఖచ్చితంగా వరమే అని చాలామంది చెబుతారు. విభజన వల్లనే కేసీఆర్ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు.
రాష్ట్ర అభివృద్ధి పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు తెలంగాణకు తీసుకువచ్చారు. కాంగ్రెస్, టీడీపీలను నిర్వీర్యం చేసి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా నియంత్రించారు.
జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాలనే ప్రయత్నం చేశారు. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబు నాయుడును గద్దె దింపడంలో పాత్ర పోషించారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో కేసీఆర్ ప్రభావం ఉందన్న వాదన కూడా ఉంది.
నేటికీ ఆంధ్రా నీటి దోపిడీ అంటూ, చంద్రబాబు నాయుడును బూచిగా చూపిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోంది. అదే ఆయుధంతో అధికార కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది.
అయితే కేసీఆర్ పాలనలో అభివృద్ధి పేరుతో వేల కోట్ల అవినీతి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు కాంగ్రెస్ నేతల నుంచే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత నుంచీ రావడం గమనార్హం.
ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్ర విభజన వల్ల కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా, పరిపాలనాపరంగా అన్ని విధాలా లాభపడ్డారని స్పష్టమవుతుంది. కానీ అదే విభజన రాజకీయాలు నేడు వారికి భారంగా మారాయి.
తెలంగాణలో పైచేయి కోసం టీడీపీని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం చివరకు బీఆర్ఎస్‌కు నష్టమే చేసింది. ఇది శాపం కాదు; చంద్రబాబు ఇచ్చిన రాజకీయ రిటర్న్ గిఫ్ట్‌గా చాలామంది భావిస్తున్నారు.
ఈ విషయాన్ని కేసీఆర్ బహిరంగంగా చెప్పలేరు. అందుకే చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తుంటారు. తన రాజకీయ నష్టాన్ని రాష్ట్ర నష్టంగా చిత్రీకరిస్తున్నారు.
రాష్ట్ర విభజన వల్ల అన్ని విధాల లాభపడ్డ తర్వాత, తెలంగాణ రాజకీయాలకే పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ నేటికీ ఏపీని బూచిగా చూపడమే రాజకీయ వ్యూహంగా కొనసాగిస్తున్నారు.
కనుక ఆ విధానానికి ఫలితాలు కూడా అలాగే వస్తాయి. మంచి ఫలితాలు మాత్రమే కావాలంటే ఏపీ పట్ల విధానం మార్చుకోక తప్పదు. లేకపోతే మంచి–చెడు రెండింటికీ సిద్ధపడాల్సిందే.
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…
November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…