Telugu

కేసీఆర్ సాబ్… ఏంటీ తుగ్లక్ చర్య?

అధికారంలోకి వచ్చినవెంటనే తెలంగాణ ప్రభుత్వం జిల్లాల సంఖ్య పెంచింది. నేతల ఒత్తిళ్లు ,తదితర కారణాలతో ముప్పైఒక్క జిల్లాలు ఏర్పాటు చేసినా, ఇప్పుడు అన్ని జిల్లాల అవసరం ఉందా అన్న తర్జనభర్జనలో ప్రభుత్వం పడుతుందని సమాచారం. ఇప్పుడు కొన్ని జిల్లాలను ఎత్తేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట ప్రభుత్వం.

ప్రధానంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచిస్తున్నట్లు కధనం. జనగాం, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి తదితర జిల్లాలను కొనసాగించాలా..?, వాటిలో కొన్నింటిని ఎత్తివేయాలా..? అన్న దిశగా ప్రభుత్వం యోచిస్తున్నారట. ఈ క్రమంలో అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను, పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ పురమాయించినట్టు వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఏడాది క్రితం ఎవరైనా ఇన్ని జిల్లాలు ఎందుకు ఎవరైనా అడిగితే వారిపై టిఆర్ఎస్ నేతలు కస్సున లేచేవారు. ఇప్పుడు దీనిని ప్రభుత్వం ఏవిధంగా సమర్ధించుకుంటుందో? ఈ వార్తలపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. రాజధానిని ఢిల్లీ నుండి దౌల్తాబాద్ కు, దౌల్తాబాద్ నుండి ఢిల్లీకు అనేక సార్లు మార్చిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ను కేసీఆర్ తలపిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Hyderabad’s 1.32 Lakh Stadium: Criminal Waste of Money?

Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…

30 minutes ago

Hyderabad Hit-And-Run: Anand Sai’s Son Sandeep Arrested

Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…

40 minutes ago