Telugu

జైలర్-2 ఓకే.. గరివిడి లక్ష్మి కూడా ఓకేనా?

ప్రైవేట్ ట్రావెల్స్ వార్త అంటే అగ్నిప్రమాదాలే అన్నట్లు తెలుగు సినిమాలంటే ‘కొరుకుడు.. నరుకుడే’ అన్నట్లుగా మారాయని చెప్పక తప్పదు.

మన భాషాభిమానం జగత్ ప్రసిద్దమైనది కనుక కోలీవుడ్‌ దర్శక నిర్మాతలు తమిళ పేర్లతోనే తెలుగు డబ్బింగ్ సినిమాలు విడుదల చేసేస్తున్నారు.

ADVERTISEMENT

ఒకవేళ తెలుగు సినీ దర్శక నిర్మాతలు అచ్చమైన తెలుగు పేర్లు, అచ్చమైన తెలుగు పాటలతో సినిమాలు తీస్తున్నారంటే, మనం తమిళ సినిమా పేర్లను ఆక్షేపించినా అర్థం ఉంటుంది. కానీ మన సినిమాల పేర్లు ఇంగ్లీషులో, ఒక్కోసారి హిందీలో ఉంటాయి.

పాటలు సరేసరి. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అని చెప్తే తప్ప ప్రజలకు అర్థం కాదనుకుంటారు. ఆ పాటలు కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు కలిపి మరో కొత్త భాషలో వదులుతున్నారు.

అంటే తెలుగు సినిమా చూడాలన్నా, తెలుగు పాట అర్థం చేసుకోవాలన్నా కనీసం ఈ మూడు భాషలపై పట్టు ఉండాలన్న మాట!

తాజాగా రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమా నుంచి ‘వన్ సన్, వన్ మూన్’ (ఒక సూర్యుడు, ఒక చంద్రుడు) పేరుతో తెలుగులో ఓ పాట విడుదల చేశారు. ఆ ర్యాప్ సాంగ్‌లో తెలుగు పదాలను కనిపెట్టి అర్థం చేసుకోవడమే ప్రేక్షకులకు పెద్ద సవాల్.

అయితే నేటి జనరేషన్ వాటిని సులువుగానే కనిపెట్టగలదు. అర్థం చేసుకోగలదు. పైగా ఇది రజనీకాంత్ సినిమా. కనుక ఈ పాట ఎలా ఉన్నా చెల్లిపోతుంది.

కానీ అచ్చమైన తెలుగు పాటలో ఇంత ‘పవర్’ ఉండదనే, ఇంగ్లీషు ముక్కలు వేసి పాట ర్యాప్ చేశారా? అనే సందేహం కలుగుతుంది.

సరే! అచ్చమైన తెలుగు పాట వినిపిస్తే ఎంతమంది వింటారు? ముందు వినిపించే ప్రశ్న అది ఏ రాష్ట్రానికి చెందిన కథ? ఎవరి సంస్కృతి, జీవన విధానానికి అద్దం పడుతోంది? కానీ జైలర్ లేదా ఇతర భాషల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు ఈ ప్రశ్న ఎదురుకాదు. అవి అతీతం.

ఉదాహరణకు అక్టోబర్ 17న విడుదల కాబోతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమా నుంచి ‘కొండాకోన..’ అంటూ సాగే చక్కటి పాట విడుదలైంది. 90లలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఉర్రూతలూగించిన ప్రముఖ జానపద గాయని, ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవితగాథ ఆధారంగా ఈ సినిమా తీశారు. కనుక దీనిలో ఆ ‘కొరుకుడు, నరుకుడు’ రెండూ ఉండవు. పైగా సినిమాపై ‘ఉత్తరాంధ్రా’ ముద్ర ఉండనే ఉంది. కనుక ‘ది ప్యారడైజ్’కు ఎదురైన ప్రాంతీయవాద సమస్య, దీనికీ తప్పదా?అనే సందేహం కలుగుతుంది.

సినిమాలను, పాటలను రాష్ట్రాలు, ప్రాంతాలు, మాండలికాలకు అతీతంగా చూడాలి..వినాలి… ఆస్వాదించాలి. అయితే తమిళ, హిందీ సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలకు లేని అభ్యంతరాలు అచ్చమైన తెలుగు సినిమాలకే ఎందుకు?అనే ప్రశ్నకు ఎవరికీ వారు జవాబు చెప్పుకోవాల్సిందే.

జైలర్-2 ర్యాప్ సాంగ్‌ విన్న తర్వాత, అచ్చమైన ఈ తెలుగు పాట వింటే, మనం ఏం వదులుకుంటున్నామో, ఎక్కడి దారి తప్పమో అర్ధమవుతుంది.

ముఖ్యంగా పాన్ ఇండియా మోజులో పడి తెలుగు భాష, తెలుగు మాట, పాట, తెలుగువారి జీవనవిధానం అన్నిటినీ వదిలేసుకోవడమంటే ఆత్మ శరీరాన్ని విడిచి పెట్టేసినట్లేనని ఎప్పటికి గ్రహిస్తారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Endgame Returns, Takes Down Baahubali Record

Seven years later, Avengers: Endgame has returned to Indian theatres and picked a rather interesting…

35 minutes ago

Jailer 2 Has the Brand, But Where Is the Frenzy?

Jailer 2 has all the ammunition for a frenzy, but the trigger hasn't been pulled…

1 hour ago