Telugu

విజయసాయిరెడ్డితో పరివర్తన సాధ్యమేనా?

మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొద్ది సేపటి క్రితం విజయవాడలో తన కొత్త పార్టీ ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అని ప్రకటించారు. ఈ సందర్భంగా తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాలో పైన కాషాయం, కింద భాగంలో తెలుపు రంగులు కలిగి మధ్యలో ధర్మచక్రం ఉంది.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ADVERTISEMENT

· ఎప్పటికీ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని, ప్రజలను పాలించాలా?వారి వారసులే ముఖ్యమంత్రి, మంత్రి పదవులు చేపట్టాలా?

· నేను ఈ పార్టీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మార్చేస్తానని చెప్పడం లేదు. ఈ ఐదు కోట్ల మంది ప్రజల్లో నుంచే నాయకులను తయారుచేసి వారికే ఈ బాధ్యత అప్పగిస్తాను. పీఆర్‌పీలో రాజకీయ వారసత్వం ఉండదు. బడుగు, బలహీన వర్గాల వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే నా లక్ష్యం.

· అధికార పార్టీ ఎంతసేపు గొప్పలు చెప్పుకుంటుంటే, ప్రతిపక్షపార్టీ అహంకారంతో రాజకీయాలతో కాలక్షేపం చేస్తోంది.

· భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 11 సీట్లకు ఎందుకు పడిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి అహంకారం వల్లనే.

· నా స్వీయ శక్తి సామర్థ్యాలతోనే ఎంపీ స్థాయికి ఎదిగాను తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ స్థాయికి ఎదగలేదు.

· వైసీపీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను. కానీ అనేక అవమానాలు ఎదుర్కొని బయటకు వెళ్ళేలా చేశారు.

· నేను పార్టీ పెడుతున్నానని ప్రకటించగానే అటు టీడీపీ, ఇటు వైసీపీ నాపై దుష్ప్రచారం మొదలుపెట్టేశాయి. కానీ నేను ఆ దేవుడిపై ప్రమాణం చేసి చెప్తున్నా… నేను ఎవరికీ బీ టీమ్‌ కాదు. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరి వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని తేల్చి పడేశారు. కనుకనే తాను ప్రజల కోసం ఈ పీఆర్‌పీని స్థాపించానని విజయసాయి రెడ్డి చెప్పారు.

ఆయన ఏడాది పాటు రాజకీయ సన్యాసం చేసి పరివర్తన చెందితే అందరూ హర్షించేవారు. కానీ ఈ రాజకీయ పార్టీ కోసం ఏర్పాట్లు చేసుకునేందుకే ఏడాది గ్యాప్ తీసుకున్నారని స్పష్టమవుతోంది.

తాను వైసీపీలో ఉన్నప్పుడు అనేక కుట్రలు చేసి టీడీపీ-బీజేపీలను విడగొట్టానని ఇటీవలే ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఇక 11 అక్రమాస్తుల కేసులలో ఏ-2గా, ఏపీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, నాకు ముఖ్యమంత్రి పదవి అక్కరలేదు. రాష్ట్రానికి మేలు చేసేందుకే వచ్చానని, రాజకీయాలలో పరివర్తన తెస్తానని చెప్తే నమ్మశక్యంగా ఉందా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Thaman Brings Singer Balayya Back!

Balakrishna has another surprise for his fans. The actor, who is known for his energetic…

5 minutes ago

Dorothy Actress Opens Up About Years of Loneliness

Jeeva Subramaniam, who plays a notable role in Karthik Subbaraj's Dorothy, has opened up about…

34 minutes ago