Telugu

తెలుగు తమ్ముళ్ల తడాకా..!

భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలు పెట్ఠిప్పటి నుండి, ఎందరో దిగ్గజాల బాట లో టీం ఇండియా నడిచింది. కపిల్, సచిన్, సునీల్, ధోని, తాజాగా విరాట్ వంటి ఎందరో లెజెండరీ ఆటగాళ్ల పుట్టినిల్లు భారత్! అయితే, అదంతా మంచిగానే ఉన్నప్పటికీ, మన తెలుగు వారు, జట్టు లో తమ ఉనికిని చాటుకునేందుకు కొన్ని దశబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు.

అజరుద్దీన్, ఎం.ఎస్.కె.ప్రసాద్, అంబటి రాయుడు,వి వి ఎస్ లక్ష్మణ్ వంటి గొప్ప ఆటతీరు గల ఆటగాళ్లు జట్టులో ఎంపికయినప్పటికీ, ఒక అజారుద్దీన్ తప్ప మిగిలినవారు అంతర్జాతీయంగా వారి స్థాయికి తగ్గ కీర్తిని అందుకోవడంలో ఓ మోస్తరు గా విఫలమయ్యారనే చెప్పాలి.

ADVERTISEMENT

అయితే, గత కొన్నేళ్లుగా, ఐ.పీ.ఎల్ పుణ్యమా అంటూ ఎందరో తెలుగు తేజాలు జాతీయ స్థాయిలో కీర్తింపబడి అటు అంతర్జాతీయ అంతస్థు ను కూడా అందుకోగలిగారు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్ట్ లో ఇక భారత్ కు పరాజయం తప్పదు అని అంతా ఖరాఖండిగా చెప్పినప్పటికీ, తెలుగు కుర్రోడు ‘హనుమ విహారి’ మరియు అశ్విన్ ల బ్యాటింగ్ వలన ఆ టెస్ట్ ను డ్రా గా ముగించి, టీం ఇండియా కు ఎదురవ్వబోయే పరాభవాన్ని అడ్డుకున్నారు.

అయితే, అదే ఏడు బీ.జీ.టీ లో నే డెబ్యూ చేసిన హైదరాబాద్ కుర్రోడు ‘మొహమ్మద్ సిరాజ్’ నేడు భారత బౌలింగ్ దళం లో నే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తొలుత ఐపీఎల్ 2020 లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుని, 2021 లో అంతర్జాతీయ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుని, నేడు తన ఉనికిని చాటుకున్నాడు.

అయితే తాజా సంచలనాలుగా మారారు మరొక ఇద్దరు తెలుగోళ్లు. ఇటీవలే బంగ్లా జట్టు తో మూడు టి-20 ల సిరీస్ ఆడిన భారత్, ఆ సిరీస్ లో ‘నితీష్ కుమార్ రెడ్డి’ తో డెబ్యూ చూపించారు టీం ఇండియా. తొలి సిరీస్ లో నే నితీష్ తన ప్రత్యేకతను చూపారు. కపిల్, హార్దిక్, తరువాత భారత్ కు దొరికిన మరొక పేస్ ఆల్-రౌండర్ గా గుర్తించబడ్డాడు.

ఇక చివరిగా ఇటీవలే సౌత్ ఆఫ్రికా వెళ్లి వారితో 4 మ్యాచ్ల టి-20 సిరీస్ లో తిరిగి జట్టు లోకి వచ్చిన ‘తిలక్ వర్మ’ ఇక తన చోటును జట్టు లో కదపలేని ఒక బండరాయి వలె అత్యంత ధృడంగా అయ్యేటట్లు తన ఆటను చూపారు. రెండు మ్యాచ్లలోను రెండు సెంచరీలు కొట్టి ఔరా అనిపించాడు. చూడాలి మరి రాబోయే కాలం లో ఈ నెంబర్ ఇంకా పెరుగుతుందేమో అని..?

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

PM Modi’s Celebration Meet Sparks Outrage: Is It Fair?

Prime Minister Narendra Modi is reportedly set to meet India’s Asian Games gold winning cricket…

21 minutes ago

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

41 minutes ago