
ఐపీఎల్ చూస్తే చూడండి… కానీ సినిమాలు చూడడానికి ధియేటర్లకు కూడా రండి అంటూ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేక్షుకులను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానిని సవరించుకుని, డిమాండ్ కాస్త విన్నపంగా మార్చుకున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకులు ధియేటర్లకు దూరం అయ్యారనేది వాస్తవం.
ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. నేడు మొదటి ఎలిమినేటర్ లో భాగంగా హైదరాబాద్ – కోల్ కతా జట్లు తలపడనుండగా, ఇంకా మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వారంతో ఐపీఎల్ వినోదం ముగియనుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం కావడానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది.
ఇక ఐపీఎల్ కు ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించిన మరో అంశం రాజకీయం. హాట్ హాట్ గా మారిన ఏపీ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ పోలింగ్ నాడు హైదరాబాద్ ఖాళీ అయిపోయిందంటే, ఏపీ పొలిటిక్స్ ఎంతటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే.
ప్రస్తుతం ఆ హడావుడి కూడా ముగిసింది. పోలింగ్ ముగియడంతో అన్ని రాజకీయ పార్టీ నాయకులు విదేశాలకు వెళ్లి విహరిస్తున్నారు. స్థానిక నేతలు యధావిధిగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జూన్ 4వ తేదీన అధికారంలోకి రాబోయే పార్టీ తమదే అంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన ఈవీఎం బాక్స్ లను కాపాడుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
అలా గడిచిన రెండు నెలలుగా ఐపీఎల్ మరియు రాజకీయం కలగలిసి ఆడియన్స్ ను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఆ రెండింటికి విరామం లభించినట్లే! వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం కావాలన్నా, ఏపీ ఎలక్షన్స్ ఫలితాలు తెలియాలన్నా జూన్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే!
అయితే ఈ పది రోజులకైనా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరిస్తారనే గంపెడు ఆశతో నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ లను సిద్ధం చేసారు. “డీజే టిల్లు స్క్వేర్” తర్వాత విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను రంజింప చేయలేకపోయింది.
ఈ వారంలో దిల్ రాజు “లవ్ మీ,” జబర్దస్త్ సుధీర్ “గోట్” సినిమాలను సిద్ధం చేయగా, వచ్చే వారంలో విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,” ఆనంద్ దేవరకొండ “గం గం గణేషా,” సుధీర్ బాబు “హరోం హర” సినిమాలను రెడీ చేసారు. ఇవి కాక మరో మూడు, నాలుగు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
జూన్ నెలాఖరున విడుదల కాబోయే ప్రభాస్ “కల్కి” సినిమాకు దాదాపుగా నెల రోజుల సమయం ఉండడంతో, ఈ నెల రోజుల పాటు చిన్న బడ్జెట్ సినిమాల నుండి “డబుల్ ఇస్మార్ట్” వంటి మోస్తరు బడ్జెట్ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే వీటన్నింటిలో ఆడియన్స్ ను చిల్ చేసి సిల్వర్ స్క్రీన్ పై సమ్మోహితులను చేసే సినిమాలేవో చూడాలి!
Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…