Telugu

తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో, ‘తెలంగాణ వాదం’ అనే ప్రాంతీయతత్వంతో ఏర్పడిన పార్టీలు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.

తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన ఈ రెండు పార్టీలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, పాలనాపరమైన గుర్తింపుతో వారి వారి రాజకీయ సిద్ధాంతాలతో ప్రజల మన్ననలు పొందాయి. హైటెక్ ముఖ్యమంత్రి గా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు, ఉద్యమ నాయకుడిగా తెరాస పార్టీ అధినేత చంద్రశేఖర్ ఈ ఇద్దరు చంద్రులు కూడా పాలనలో తనదైన మార్క్ చూపించారు.

ADVERTISEMENT

40 ఏళ్ళ టీడీపీ చరిత్ర, 25 ఏళ్ళ బిఆర్ఎస్ ప్రస్థానం రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. అయితే టీడీపీ అధినేత సంక్షోభాలతో అవకాశాలను సృష్టించుకుంటే, బిఆర్ఎస్ అధినేత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఓటమి గెలుపుని ఒకే తీరుగా చూసే బాబు ఓటమితో కుంగిపోలేదు, అవమానాలకు తలవంచలేదు.

పదేళ్ల అధికార పక్షంలోను, పదిహేనేళ్ల ప్రతిపక్షం లోను ఒకే విధమైన రాజకీయంతో ముందుకెళ్లారు, తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు బాబు. అయితే పదిహేనేళ్ల పోరాటంలో ఎన్నడూ తడబడని కేసీఆర్ పదేళ్ల అధికారానికి దూరమయ్యే సరికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ సైకిల్ పనైపోయింది, ఇక ఏపీలో పసుపు జెండా కనుమరుగే అంటూ అప్పటి ప్రభుత్వపెద్దలు టీడీపీ ఆత్మ స్తైర్యం మీద కొట్టారు. అలాగే రాష్ట్ర విభజనతో తెలంగాణలో పుట్టిన టీడీపీ ని తెలంగాణ వాదం అనే ప్రాంతీయ వాదంతో మట్టికరిపించారు కేసీఆర్.

ఇక 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి ఆ పార్టీని నైతికంగా కుంగతీసింది. దానికి తోడు వైసీపీ రాజకీయంలో అధినేత బాబు బంది అవడం ఇక ఏపీలో టీడీపీ శకం ముగిసింది అంటూ టీడీపీ మనోధైర్యం మీద దెబ్బ కొట్టారు వైస్ జగన్. ఇలా రాజకీయంగా టీడీపీ ని భూస్థాపితం చెయ్యాలన్న పార్టీ సారి పడిలేచిన కెరటం మాదిరి టీడీపీ ప్రత్యర్థులను ప్రత్యక్షం గానో, పరోక్షంగానో ముంచేస్తుంది.

ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే, ఒకప్పుడు అక్షయ పాత్రలా నిండుగా ఉండే కేసీఆర్ కారు ఇప్పుడు గ్యారేజిలో ఖాళీగా దర్శనమిస్తుంది. 2023 ఎన్నికలలో ఆ పార్టీ ఓటమితో ఇప్పటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ క్యాడర్ కు అందుబాటులోకి రాలేకపోయారు. ఏ ప్రాంతీయ వాదం మీద పార్టీ ఆవిర్భవించిందో అదే ప్రాంతీయ వాదాన్ని పక్కన పెట్టి తెరాస, బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది.

కానీ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలుగు వాడి ఆత్మ గౌరవం, తెలుగు జాతి అభ్యున్నతి అంటూ ముందుకెళుతున్న టీడీపీ ఇప్పటికి అదే సిద్ధాంతానికి కడ్డుబడి రాజకీయం చేస్తుంది. ఈ ఒక్క కారణం తో బిఆర్ఎస్ పదేపదే టీడీపీ ని హేళన చేసినా, ఆ పార్టీని రెచ్చకొట్టేలా దూషించినా ఇప్పటికి సంయమనంతో రాజకీయం చేస్తుంది.

అయితే ఈ నెల 27 న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిన ఆ పార్టీకి తిరిగి జీవం పోస్తుందా అన్నది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

15 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

46 minutes ago