దేవుళ్ళే దెయ్యాలయ్యారా..?

ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ మీరే మా దేవుళ్ళు…మేము మీ సేవకులం, మాకు ఓటేసి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మహాప్రభో అంటూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని మరి ఓటడిగిన వైసీపీ నాయకులు పోలింగ్ డే రోజు మాత్రం తమ వక్రబుద్ధిని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.

ADVERTISEMENT

ఇప్పుడు ఆ దేవుళ్ళే దెయ్యాలయ్యారు అనేలా వైసీపీ నేతలు ఓటర్లను కూడా వదలకుండా దాడులకు పాల్పడడం వైసీపీ సంస్కృతిని బయటపెడుతోంది. ఇందులో భాగంగానే పోలింగ్ కేంద్రాలలో స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకులే ఓటర్ల మీద దాడులతో రెచ్చిపోయారు. తెనాలిలో సుధాకర్ అనే ఓటర్ మీద అక్కడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివ కుమార్ చేయి చేసుకున్న సంఘటన సంచలంగా మారింది.

కేవలం శివ కుమార్ ను క్యూ లైన్ లో వచ్చి ఓటు వేయమన్నందుకే నా పై దాడికి పాల్పడ్డాడు అంటూ సుధాకర్ వాపోతున్నారు. తన పై అకారణంగా చేయి చేసుకున్నందుకు తిరిగి తానూ ఎమ్మెల్యే ను కొట్టానంటూ, దానికి ఆ వైసీపీ నేత అనుచరులు విచక్షణ రహితంగా నా పై దాడి చేసి నా కుటుంబాన్ని చంపుతాం అంటూ బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించి బెంగుళూరు నుండి వచ్చి నా ఓటు హక్కు వినియోగించుకున్నందుకు నాకు దక్కిన బహుమానం ఇది అంటూ తన గోడు వెళ్లబోసున్నారు. అయితే అటు సుధాకర్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు.

అయితే ఓటర్ మీద చెయ్యి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్ దాన్ని కూడా సమర్ధించుకుంటూ అది కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కులాలను, మతాలను మధ్యలోకి తీసుకువచ్చి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. అలాగే జోగి రమేష్ పోటీ చేస్తున్న పెనమలూరు నియోజకవర్గంలో కూడా పోలింగ్ కేంద్రంలో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ వీరంగం సృష్టించారు. అక్కడి కుర్చీలను విసిరేస్తూ పోలింగ్ ను ఆపేయాలంటూ పోలింగ్ సిబ్బంది పై దాడికి పాల్పడ్డారు.

ఇక రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న దాడుల పై స్పందించిన చంద్రబాబు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డొచ్చిన వారి పై దాడులు చేస్తూ ఓటర్లను భయపెట్టి, పోలింగ్ అడియాకెయులను బెదిరించి పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే అటువంటి వారి పై చర్యలు తీసుకుని పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగేలా చూడాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bharata Varsha’s Amma Kadhili Vacche: A Spiritual Touch

Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…

2 minutes ago

BCCI Spoiled Vaibhav’s Confidence? WC Winner Reveals

India's team management has come under backlash for constantly changing its opening combination in T20Is.…

35 minutes ago