
విజయవంతమైన వ్యక్తులతో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజమని, తాను కూడా అలాగే అనుకుని వర్మతో కలిసి పని చేశానని అన్నారు. కానీ ఆయనలో మరో మనిషి ఉన్నాడని ఆయన చెప్పారు. తాను ఆయనలోని స్వలింగ సంపర్క స్వభావాన్ని బయట పెట్టాలనుకోవడం లేదని, కానీ ఆయన లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
‘మీ టూ’ తరహాలో ఆర్జీవీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్న ఆయన, వర్మ ఎందరో యువ కళాకారులు, రచయితలను వేధించాడని ఆరోపించారు. బాధితులంతా ‘మీ టూ ఆర్జీవీ’ క్యాంపెయిన్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన వర్మ జీఎస్టీ స్క్రిప్టు తనదేనని, దానిని హ్యాక్ చేశాననడంలో నిజం లేదని పేర్కొంటూ ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేశాడు
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…