సినిమా అడ్డుగోడలు కూలిపోతున్నాయిగా

గంగోత్రి నుంచి మొదలైన అల్లు అర్జున్‌ నట ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్ళు. వాటన్నిటికీ కవర్ పేజ్ వంటిది పుష్ప-2 అని చెప్పుకోవచ్చు. పుష్ప మొదటి భాగంలోనే అల్లు అర్జున్‌ ‘తగ్గేదేలే..’ అంటూ తన కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్నారు.

ఇప్పుడు పుష్ప-2లో తన నట విశ్వరూపం చూపారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో అందరూ సినిమా గురించి కంటే దానిలో అల్లు అర్జున్‌ నటన గురించే ఎక్కువ చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర గొప్పదనం గురించి రాంగోపాల్ వర్మ తన అభిప్రాయం చెపుతూ ఈ పాత్ర దశాబ్ధాలపాటు అందరికీ గుర్తుండిపోతుందన్నారు.

ADVERTISEMENT

పుష్ప-2లో అల్లు అర్జున్‌ నటనతో పాటు మరి కొన్ని అంశాలపై చర్చలు సాగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తీసిన విదానం, టాలీవుడ్-బాలీవుడ్‌ సినిమాల మద్య తేడాలు, భారతీయ సినిమాపై పెరుగుతున్న టాలీవుడ్‌ ఆధిపత్యం, దాని ప్రభావం, పర్యావసనాలు ఇంకా చాలా అంశాలపై సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా, పుష్ప-2 సినిమాని చూసి అల్లు అర్జున్‌ నటనని మెచ్చుకుంటూ, త్వరలో అతని పాత సినిమాలన్నీ కూడా చూస్తానని చెప్పడం ఓ అపూర్వమైన గౌరవమే కదా?

దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలను మలచిన తీరుని కూడా ముఖేష్ ఖన్నా ప్రశంశిస్తూ, ‘పుష్ప-2లో భార్యాభర్తల మద్య వచ్చే సన్నివేశాలు హృదయాలను తాకుతూ పులకరింపజేస్తాయి. అదే… బాలీవుడ్‌లో అయితే భార్యాభర్తల సన్నివేశాలలో ముద్ధులు, హద్దులు మీరిన శృంగారాన్ని చూపడం తప్పనిసరి అనుకుంటారు.

వాటితో ప్రేక్షకులను ఆకట్టుకొని కలెక్షన్స్‌ పెంచుకోవచ్చచేమో కానీ అవి ఆ సినిమా గొప్పదనాన్ని పెంచలేవు. పుష్ప-2 చూసిన తర్వాత దక్షిణాది దర్శక నిర్మాతలు, నటీ నటుల నుంచి బాలీవుడ్‌ నేర్చుకోవలసింది చాలా ఉందనిపిస్తుంది,” అని ముఖేష్ ఖన్నా అన్నారు. ఇటువంటి ప్రశంశలు వింటున్నప్పుడు పుష్ప-2కి ప్రత్యేకంగా మరో జాతీయ అవార్డు అవసరం లేదనిపిస్తుంది.

కానీ అవార్డులు కూడా తీసుకువస్తానంటూ రాజమౌళి ‘ఈగ’తోనే ప్రపంచదేశాలు చుట్టి వచ్చారు. ఆ తర్వాత అందరి చేత ‘బాహుబలి’ అనిపించుకొని ‘నాటునాటు’గా పాడించి ఆడించి ఆస్కార్ అవార్డు పట్టుకొచ్చేశారు.

అప్పటి నుంచే ఉత్తరాదిపై ముఖ్యంగా… తమకు తిరుగేలేదు.. ఎవరూ తమతో పోటీ పడలేరనుకున్న బాలీవుడ్‌పై టాలీవుడ్‌ దండయాత్ర మొదలైపోయింది. కార్తికేయ, కల్కి ఏడీ 2898, హనుమాన్, సలార్ వంటి సినిమాలు దానిని కొనసాగించాయి.

ఇప్పుడు పుష్ప-2తో దక్షిణాది ప్రభంజనం ఉత్తరాది రాష్ట్రాలను, ముఖ్యంగా… బాలీవుడ్‌ని చుట్టుముట్టింది. బాలీవుడ్‌ దర్శక నిర్మాతలను పునరాలోచించుకునేలా చేస్తోంది.

అయితే ఈ దక్షిణాది ప్రభంజనం బంగాళాఖాతంలో తుఫానులా ఒక్కసారిగా బాలీవుడ్‌పై విరుచుకుపడి క్రమేపీ తగ్గిపోతుందా లేక ఇలాగే కొనసాగుతూ అనేది రాబోయే సంవత్సరాలలో తెలుస్తుంది.

కానీ సంతోషించవలసిన విషయం ఒకటుంది. ఈ ప్రభంజనంతో భారతీయ సినిమా మద్య అడ్డుగోడలు, సరిహద్దులు అన్నీ తొలగిపోయి అందరూ ఏకం అవుతున్నారు. భారతీయ సినిమా ఒక్కటిగా అవిర్భవిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KKR vs GT: Almost Out? KKR Season Slipping Away!

The 24th match of IPL 2026 Gujarat Titans defeat Kolkata Knight Riders by 5 wickets…

4 hours ago

Papam Prathap Review: Papam Prekshakulu

BOTTOM LINE Papam Prekshakulu RATING 1.5/5 Story, Screenplay, Direction: SP Durga Naresh Cast: Thiruveer, Ajay…

5 hours ago