Telugu

‘ఒకే ఒక జీవితం’ కాన్సెప్ట్‌.. టాలీవుడ్ స్టార్ రూ.500 కోట్ల మూవీ!

సినిమా ఇండ‌స్ట్రీలో వెరైటీ ఉండాల‌ని.. వైవిధ‌మ్యైన చిత్రాలు రావాల‌ని కొంద‌రు అంటుంటారు. అయితే కొన్ని సార్లు అనుకోని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతుంటాయి. అదేంటో తెలుసా! ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కాస్త ఆటో ఇటుగానో తీసే సినిమాల‌కు సంబంధించిన కాన్సెప్ట్ ఒక‌టిగానే ఉంటుంటాయి. ఆ విష‌యం సినిమాలు రిలీజ్ అయ్యే వార‌కు వారికి కూడా తెలియ‌వు. సినిమాల‌ను చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌వుతాయి. కొన్నిసార్లు ఒకే కాన్సెప్ట్‌ను ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌రి స్టైల్లో, బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిస్తుంటారు. ఈ రెండు కోవ‌కు చెందిన దానికి ఉదాహ‌ర‌ణ‌గా అప‌రిచితుడు, చంద్ర‌ముఖి సినిమాల‌ను చెప్పుకోవ‌చ్చు. ఈ రెండు సినిమాల మెయిన్ కాన్సెప్ట్‌.. మ‌ల్టిపుల్ ప‌ర్స‌నాలిటీ డిజాస్ట‌ర్‌. కానీ రెండు సినిమాల బ‌డ్జెట్స్, బ్యాక్ డ్రాప్స్ వేర్వేరు. రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి.

ఇప్పుడు అలాంటి గ‌మ్మ‌త్తు మ‌రోసారి జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా విడుద‌లై ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులుంటారు. వారిలో హీరో ఒక‌రు. పెద్ద‌యిన త‌ర్వాత వారు చిన్న‌ప్పుడు అనుకోకుండా చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే అవకాశం వ‌స్తుంది. టైమ్ మిష‌న్‌లో వారి బాల్యంలోకి వెళ్లే ఛాన్స్ వ‌స్తుంది. వెళ‌తారు. టైమ్ ట్రావెట్ అనే కాంప్లికేటెడ్ పాయింట్‌ను దర్శ‌కుడు ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్, భారీత‌నం లేకుండా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూ.500 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉంది. పాన్ ఇండియా రేంజ్‌లోని అగ్ర తార‌గ‌ణ‌మంతా ఇందులో న‌టిస్తున్నారు. టైమ్ మిష‌న్ కాన్సెప్ట్‌ను ఒకే ఒక జీవితం త‌ర‌హాలో సింపుల్‌గా కాకుండా బ‌డ్జెట్‌కు త‌గ్గ‌ట్టు భారీ రేంజ్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నార‌ట‌. ఒకే ఒక జీవితం సినిమాలాగా కాకుండా ఈ సినిమా మ‌రో నేప‌థ్యంలో తెర‌కెక్కనుంది. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు మెయిన్ కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తే మాత్రం ఒకే ఒక జీవితం సినిమా గుర్తుకు వ‌స్తుంద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న గుస‌గుస‌లు. మ‌రి అంత బ‌డ్జెట్ పెట్టి టైమ్ ట్రావెల్ మూవీ చేసే స‌ద‌రు అగ్ర హీరో ఎవ‌రో తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు..

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Three BMWs, But No Car for Wamiqa Gabbi?

Car gifts after a hit have almost become a familiar part of South Indian cinema…

11 minutes ago

Anil Ravipudi Says Festivals Don’t Matter, Then Why Sankranthi Again?

Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…

41 minutes ago