
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒక రాష్ట్రంలోని రాజకీయాలు, వాటి ప్రభావాలు మరో రాష్ట్రంలో ప్రతిభింబిస్తూనే ఉన్నాయి. 2019 ఎన్నికలలో కేసీఆర్ చంద్రబాబు నాయుడుని దెబ్బ కొడితే, 2023 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే ఇందుకు చిన్న ఉదాహరణ.
తాజాగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలు ఏవిదంగా సాగుతున్నాయో చెపుతూ, “2019 ఎన్నికలలో ఓడిపోయిన టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఎంతగా వేదిస్తున్నా ఆయన ఏనాడూ కోర్ రాజకీయాలు విడిచి పెట్టలేదు. నిత్యం ప్రజల మద్యే ఉంటూ జగన్ ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటాలు చేశారు. అందువల్లే ఆయన మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు.
కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తుంటారు. చంద్రబాబు నాయుడులా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించే బదులు ఎంతసేపూ నా ప్రభుత్వాని ఎలా కూల్చేయాలా… మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అవ్వాలా? అనే ఆలోచిస్తుంటారు. కేసీఆర్ ధోరణి ఈవిదంగా ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరు.
కేసీఆర్ నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నప్పుడు నేను చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేను. కనుక ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నైతికమా అనైతికమా? అని ఆలోచిస్తూ కూర్చోలేను. నా ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తే ఇక అప్పుడు నేను ఏమి మాట్లాడినా విలువ, అర్దం ఉండదు. కనుక నా జాగ్రత్తలో నేను ఉండక తప్పదు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
“తెలంగాణలో టిడిపిని తుడిచిపెట్టేయాలని కేసీఆర్ ప్రయత్నించి చివరికి తానే తుడిచిపెట్టుకుపోయారు. అదే టిడిపిని బ్రతకనిస్తే దానికి ఓ 10 శాతం ఓట్లు సాధించుకుని ఉండేది. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేది.
కానీ కేసీఆర్ తెలంగాణలో తాను, తన కుటుంబం, తన పార్టీ తప్ప మరొకరికి చోటు లేదనుకున్నారు. ఇప్పుడు ఆయనకే చోటు లేకుండా పోయిందిప్పుడు. అయినా ఆయన ధోరణి మారలేదు. దాంతో బిఆర్ఎస్ పార్టీకే ముప్పు తప్పదు.
కనుక సమాజంలో కొన్నిటిని బ్రతకనిస్తే అవి మళ్ళీ మనకో సమాజానికో పనికి వస్తాయి. అలాగే అవసరం లేకపోయినా మరొకరికి అపకారం చేస్తే అది తిరిగి ఏదో రూపంలో మనకే ముడుతుంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
“ఏపీలో జగన్ ఓటమి నుంచి తెలుసుకోవలసిన మరో పాఠం ఏమిటంటే, ప్రజలు మనకి వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు తీర్చుకోమని ప్రజలు మనకి అధికారం ఇవ్వలేదని! కనుక ప్రజలు మన నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకొని అందుకు అనుగుణంగా పనిచేయగలవాడే రాజకీయాలలో రాణించగలడు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…
Amit Rai’s Ohh My Dog appears to be getting a fresh lease of life on…