థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి… పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి?

Theaters are opening  What about big moviesతెలంగాణలో నెలక్రితమే థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల్లో థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ఒప్పుకుంది. అయితే రెండు జిల్లాలలో నైట్ షోస్ పర్మిషన్ లేకపోవడంతో నెలాఖరుకు పరిస్థితి నార్మల్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు రెండు సినిమాలే తమ రిలీజ్ డేట్ల ప్రకటన చేశాయి. దసరాకు వస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించగా… ఎస్ఆర్ కల్యాణమండపం అనే చిన్న సినిమా ఆగస్టు 4న వస్తున్నామని ప్రకటించింది. అయితే నాగ చైతన్య లవ్ స్టోరీ, గోపీచంద్ సీటిమార్ కూడా వీలైనంత త్వరగా విడుదల కావాలని అనుకుంటున్నాయి.

ADVERTISEMENT

అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడితే … ఈ రెండిట్లో ఒకటి జులై 30నే విడుదల చెయ్యాలని ఆలోచనట. నాని టక్ జగదీష్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ఆగష్టు చివరన లేదా సెప్టెంబర్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆర్ఆర్ఆర్ విడుదలను బట్టి చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ తమ రిలీజ్ డేట్లను ఖరారు చేస్తాయి.

ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే ఆచార్య దసరాకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప, కేజీఎఫ్ 2 ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఈ రెండు సినిమాలు క్రిస్మస్ కే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు విడుదల తేదీల మీద క్లారిటీ వస్తుంది. అయితే థర్డ్ వేవ్ రాకుండా ఉంటేనే ఇవన్నీ అవుతాయి.

ADVERTISEMENT
Latest Stories