ఈ “ఫ్రైడే” జగన్ దా? బాబు దా?

2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ముఖ్యమంత్రి అయితే తను ఎదుర్కుంటున్న అక్రమాస్తుల కేసు విచారణకు ప్రతి ఫ్రైడే కోర్టులో హాజరు కావలసి వస్తుంది. తద్వారా జగన్ “ఫ్రైడే” సీఎం అవుతారు అంటూ ఎన్నికలముందు టీడీపీ -జనసేన జగన్ ను ఉద్దేశించి ఎన్నికల ప్రచారాలు చేశారు. అయితే ఆ విమర్శలతో జగన్ ఎంతలా హర్ట్ అయ్యారో ఇప్పుడు ఏపీలో ‘ఫ్రైడే’ బాధితులను చూస్తే అర్ధమవుతుంది.

ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి విధ్వంసానికి ఫ్రైడే నే సాక్షిగా నిలిచింది. ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడానికి ఆయన ఎంచుకున్న రోజు ఫ్రైడే నే. తనను, తన ప్రభుత్వాన్ని విమర్శించిన ఏ ప్రతిపక్ష నేతపైన అయినా కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి జగన్ ఎంచుకున్న పంధాను సక్రమంగా అమలుచేయడానికి ఫ్రైడే నే సరైనదిగా భావించినట్లున్నారు. ఇలా ఈ జగన్ ఫ్రైడే బారిన పడినవారిలో వైసీపీ పార్టీ ఎంపీ ఆర్ఆర్ఆర్ కూడా ఉన్నారు.

ADVERTISEMENT

ఫ్రైడే రాత్రి అరెస్టు చేయడం, శని ఆదివారాలు కోర్టులకు సెలవు దినాలు కావడంతో అరెస్టయిన నేతలు కోర్ట్ ను ఆశ్రయించలేకపోవడంతో జగన్ ఆయా నేతల పై వ్యవస్థలను, అధికారులను అడ్డుపెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడతారో RRR విషయంలో రాజకీయ పార్టీలకే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా తెలిసొచ్చింది. ఈ ఫ్రైడే బాధితుల సంఖ్యలో అధిక భాగం టీడీపీ నేతలదే అని చెప్పక తప్పదు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మొదలుకొని అచ్చం నాయుడు, పట్టాభి, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా…. ఇలా అనేకమంది ఇలా జగన్ ఫ్రైడే బాధితుల లిస్టులో ఉన్నవారే. ఈ మధ్య కాలంలో ఈ శుక్రవారం లోకేష్ అరెస్టు అంటూ తప్పదు అంటూ వైసీపీ మంత్రుల హడావిడి విమర్శలు కూడా టీడీపీ శ్రేణులను కంగారుపెట్టాయి.అయితే అవి ఫలించలేదనుకోండి.

ఒకప్పుడు శుభ సూచికకు ఫ్రైడే ను ఎంచుకునే వారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ వ్యతిరేకులకు ఈ ఫ్రైడే నే ‘డ్రై’ డైలా మారిపోయింది. యాదృచ్ఛికమో లేక జగన్ స్క్రిప్ట్ లో భాగమో కానీ చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ జరిపి తీర్పుని రిజర్వ్ లో ఉంచిన ధర్మాసనం ఈ ఫ్రైడే రోజే తీర్పుని ప్రకటిస్తాననడం ఈ ఫ్రైడే బాబుదా?లేక జగన్ దా?అంటూ సర్వత్రా చర్చ జరుగుతుంది.

ఇప్పటికే ఫైబర్ నెట్ కేసులో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్ట్ నవంబర్ 9 కి వాయిదా వేస్తూ,అయితే ఈ కేసు విషయమై అప్పటి వరకు చంద్రబాబుని అరెస్టు చేయడానికి వీలులేదని తీర్పు ఇచ్చింది. బాబు తో న్యాయవాదుల ములాఖత్ ల విషయంలో జైలు అధికారులు కోత విధించడంలో ఆ ములాఖత్ ల సంఖ్యను మూడు సార్లకు పెంచాలని అలాగే కనీస సమయాన్ని 45 నుంచి 50 నిముషాలు చేయాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిల్ వేయడంకోర్ట్ తిరస్కరించడం జరిగిపోయింది.

ఇక అసలైన ఘట్టమైన బాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు తుది తీర్పు వెలువరిస్తారని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఫ్రైడే జగన్ దా?లేక బాబు దా? అంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ శ్రేణులు న్యాయస్థానం తీర్పుకై వేచి చూస్తున్నారు. ఈ ఫ్రైడే చంద్రబాబుకి అత్యంత కీలకైనా రోజు అనడంలో ఏమాత్రం సంశయం అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి శుక్రవారం కోర్టుకు తానూ హాజరు కాకపోవడం, అదే రోజు ప్రతిపక్ష నేతలు కోర్టును ఆశ్రయించకుండా చేయడం, ఇలా ఫ్రైడే రాజకీయాలతో ముందుకెళ్లడం చూస్తుంటే నిజంగానే జగన్ “ఫ్రైడే సీఎం” అనిపించుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

26 minutes ago

Vijay Deverakonda vs Rajni: Can Ranabaali Make It 3-0?

Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…

56 minutes ago