
[m9ad]
అమితాబ్, అమీర్, కత్రీనా కైఫ్, ఫాతిమాలు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” బాలీవుడ్ మూవీని తెలుగులోకి అనువదిస్తూ విడుదల చేసిన ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి కధతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ లోని ప్రతి షాట్ ను ఆసక్తికరంగా కట్ చేసారు. స్టార్స్ అంతా ఎవరికీ వారే ఆయా పాత్రలకు జీవం పోసారు.
ముఖ్యంగా ఈ వయసులో బిగ్ బీని ఈ రేంజ్ పవర్ ఫుల్ పాత్రలో చూడడం అభిమానులకు పండగ అని చెప్పొచ్చు. అలాగే పాత్రలకు ప్రాణం పోసే అమీర్ ఖాన్, ఫిరంగి పాత్రలో మరోసారి జీవించేసాడు. చూడబోతుంటే… ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమా ప్రమోషన్స్ సాగుతున్నట్లున్నాయి. ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే కన్నులవిందుగా ఉంది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…