Telugu

తిరుమల వెంకన్నతో ఆటలు.. ఇంకెంత కాలం?

తిరుమల వెంకన్న స్వామివారికి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. కానీ అదేం విచిత్రమో కానీ.. కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన తిరుమలలో గత కొన్నేళ్ళుగా అపచారాలు, దొంగతనాలు, అన్యమత ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.

తిరుమల నిర్వహణతో పాటు స్వామివారి ఆస్తులను, పవిత్రతని కాపాడాల్సిన టిటిడీ పాలక మండలిలో స్వామివారి పట్ల భక్తి, నమ్మకం లేనివారికి చోటు కల్పిస్తుండటంతో ఇవన్నీ సాగుతున్నాయని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద నిత్యపూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మాయం అయ్యింది. దీంతో భక్తులు షాక్ అయ్యారు.

వారు టిటిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడంతో ఈ విషయం బయటకు పొక్కింది. టిటిడీ పిర్యాదుతో పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా కాకీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి విగ్రహం పెకలించి, గోనె సంచీలో పెట్టుకొని వెళ్తున్నట్లు గుర్తించారు.

కనుక అతను టిటిడీలో పని చేస్తున్నాడా?లేక కొండపైకి రాకపోకలు సాగించే వాహన డ్రైవరా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు బృందాలు అతని ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఘాట్ రోడ్డులో నిత్యపూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం దొంగతనం చేయడమంటే, 1. భద్రతా వ్యవస్థ వైఫల్యం, 2. తిరుమలలో ఘోర అపచారం, 3. తిరుమల పేరుతో జరుగుతున్న నీచ రాజకీయాలుగా పరిగణించాల్సి ఉంటుంది.

ఇటువంటి అపచారాలతో తిరుమల ప్రతిష్టకు భంగం కలుగడమే కాక భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. అయినా అపచారాలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన నగదు, వెండి బంగారు కానుకలు దొంగతనాలు జరిగినప్పుడు యావత్ దేశంలో చర్చ జరిగింది. ఇప్పుడు తిరుమలలో జరిగిన విగ్రహం దొంగతనం గురించి కూడా అప్పుడే మీడియాలో వైరల్ అవుతోంది.

ముందుగా చెప్పుకున్నట్లు స్వామివారిపై భక్తి, నమ్మకం లేని అన్యమతస్తులు తిరుమలలో తిష్ట వేసుకొని ఉన్నంత కాలం ఇలాంటి అపచారాలు జరుగుతూనే ఉంటాయి. కనుక సమూలంగా ప్రక్షాళన చాలా అవసరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

మందులా ప్రజలకు యూపీఐ అలవాటు చేసి ఇప్పుడు బాదుడా?

మందు బాబులు మందు కొట్టని తమ దోస్తులకు మందు అలవాటు చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. ఒకసారి దానికి అలవాటు పడిన…

9 minutes ago

New BO King: Bethlehem Kudumba Crushes Empuraan in US

Bethlehem Kudumba Unit is rewriting Malayalam box office history. The Nivin Pauly and Mamitha Baiju…

32 minutes ago