Telugu

తిరుమలలో రాజకీయాలు… ఎవరు పోతారో?

అలనాడు సాక్షాత్ శ్రీవెంకటేశ్వర స్వామివారితో ఆయన భక్తుడు హాదీరాం భావాజీ తిరుమల కొండపై ప్రతీరోజూ రాత్రి పాచికలు ఆడేవారని పురాణాలు చెపుతున్నాయి.

కానీ నేటికీ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వం-వైసీపీలు రాజకీయ చదరంగం ఆడుకుంటూనే ఉన్నాయి.

ADVERTISEMENT

దీని వలన తిరుమల ప్రతిష్టకు భంగం కలుగుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిసి ఉన్నా తగ్గేదేలే అంటున్నాయి ఇరు వర్గాలు.

స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం, తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం, టిటిడీ గోశాలలో గోవులు చనిపోవడం, టీటీడీలో అన్యమతస్థులు పనిచేస్తుండటం, తిరుమలలో మద్యం, మాంసాహారం…. వాటి మద్య ఇలా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా స్వామివారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో సీవీ రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనానికి పాల్పడిన విషయంపై మళ్ళీ రెండు పార్టీల మద్య రాజకీయ యుద్ధాలు మొదలయ్యాయి.

రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కించే బృందంలో పనిచేస్తున్నాడు. గత ప్రభుత్వ హయంలో అంటే 2023, ఏప్రిల్ 29న విజిలెన్స్ అధికారులు అతను 900 డాలర్లు (రూ.72 వేలు) దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు.

అక్కడి నుంచే ఈ క్రైమ్‌ స్టోరీ మొదలైంది.

అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్‌ తిరుపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కానీ ఆ తర్వాత అతను చేసిన తప్పుని ఒప్పుకొని పాప ప్రాయశ్చితంగా తిరుమల, చెన్నైలోని త్యాగరాజనగర్‌లోని సుమారు వంద కోట్లు విలువగల ఆస్తులను టిటిడీకి గిఫ్ట్ డీడ్ ద్వారా వ్రాసి ఇచ్చాడు!

కనుక నిందితుడు రవి కుమార్‌- టిటిడీ తరపున సతీష్ కుమార్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ కుదుర్చుకున్నారు. ఆ కేసు ఉప సంహరించుకున్నారు.

పరకామణిలో 90 డాలర్లతో పట్టుబడిన వ్యక్తి టిటిడీకి సుమారు వంద కోట్లు విలువగల ఆస్తులు గిఫ్ట్ డీడ్‌ ద్వారా కానుకగా ఇచ్చాడంటే అతను చేతివాటం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కనుక అతనిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరిపింఛి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా వందకోట్లకు రాజీ చేసుకున్నారంటే అర్ధం ఏమిటి? అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

కానీ అతను 15 ఏళ్ళుగా పరకామణిలో దొంగతనాలు చేస్తుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుకోలేదు?ఎందుకు కేసు నమోదు చేయించలేదు? ఎందుకు సొమ్ము తిరిగి రాబట్టలేదు?అని భూమన ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంలో తాను, టీడీపిలో పనిచేసిన వైసీపీ నేతలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు. పైగా నిందితుడుపై ఒత్తిడి తెచ్చి టిటిడీకి వంద కోట్లు గిఫ్ట్ డీడ్ చేయించిన ఘనత తమదేనన్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే సీఐడీతో కాదు సీబీఐ చేత విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి సవాలు విసిరారు.

ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకి చేరడంతో న్యాయమూర్తి సీఐడీ విచారణకు ఆదేశించారు. నిందితుడుతో టిటిడీ రాజీ కుదుర్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రవి కుమార్‌కి, అతనిపై పిర్యాదు చేసి కేసు ఉపసంహరించుకున్న ఏవీఎస్వో సతీష్ కుమార్‌కి మూడు రోజులలోగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంగా చూస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి.

1. పరకామణిలో ఏళ్ళ తరబడి దొంగతనం జరిగిందని, అది వందల కోట్లు పైమాటేనని స్పష్టమవుతోంది.

2. పరకామణిలో ఏళ్ళ తరబడి ఇన్ని వందల కోట్లు దొంగతనం జరగడం, హటాత్తుగా ఒకరోజు దొంగ పట్టుబడటం, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం పేరుతో అతను వంద కోట్ల ‘గిఫ్ట్ డీడ్’ ఇవ్వడం, కేసు వాపసు తీసుకోవడం వెనుక ఇంకా చాలా పెద్ద స్టోరీయే జరిగిందని స్పష్టమవుతోంది.

ఇంత భారీగా దొంగతనం జరుగుతున్నా విజిలెన్స్ అధికారులకు తెలియదంటే నమ్మశక్యంగా ఉందా? ఇంత జరిగినా కేసు నమోదు కాలేదంటే అర్దమేమిటి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is Ethan Hunt Bigger Than Tom Cruise?

Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…

3 minutes ago

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

17 minutes ago