
“తొలిప్రేమ” సినిమాను అందించిన కరుణాకరణే, ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో పవన్ స్థానాన్ని సాయిధరమ్ తేజ్ భర్తీ చేయబోతున్నారని మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం. పవన్ స్థానంలో సాయిని ఊహించుకోవడం ఎంత అసాధ్యమో… “తొలిప్రేమ 2” తెరకెక్కడం కూడా అంతే అసాధ్యమని లభించిన విశ్వసనీయ సమాచారం. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి నటిస్తున్న మాట వాస్తవమే గానీ, ఇది ‘తొలిప్రేమ’కు సీక్వెల్ కాదన్నది స్పష్టమైన అంశం.
అసలు ఈ వార్తకు ఊతమిచ్చిన అంశం ఏమిటంటే… ఇటీవల సాయిని దర్శకుడు కరుణాకరన్ కలిసి ఓ ప్రేమకధ వినిపించగా, అది విన్న సాయి వెంటనే చేద్దామని చెప్పడంతో, ఇది ‘తొలిప్రేమ 2’ అన్న పుకార్లకు కొబ్బరికాయ కొట్టినట్లయింది. అయితే ప్రేమకధలను అద్భుతంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన కరుణాకరన్, ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనేది అసలు విషయం. పవన్ కు ‘తొలిప్రేమ’ ఎంత హిట్ అయ్యిందో, సాయికి ఈ సినిమా అంత హిట్ అవ్వాలని ఆశిద్దాం.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు 'నిన్ను అసెంబ్లీ గేటు…
One of the crucial indicators of the potential lifetime performance of any film is based…