
అంతే… వెంటనే… సినీ ప్రముఖులకు నోటీసులు… ఆ వరుసగా విచారణ… నేటితో నలుగురు విచారణ పూర్తయ్యింది. ఈ విచారణలో సినీ ప్రముఖులంతా ఎలాంటి విషయాలు వెల్లడిస్తున్నారో అధికారికంగా బయటకు వెల్లడించడం లేదు గానీ, పలు మీడియా సంస్థలు మాత్రం తమకు సమాచారం వచ్చిందంటూ కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయన్నది పక్కన పెడితే, ఈ నెలాఖరు వరకు సినీ ప్రముఖుల విచారణ కొనసాగనుందనేది బహిరంగమే. అలాగే ఈ విచారణలో అదనపు సమాచారం లభిస్తోంది, మరిన్ని దిగ్గజ కుటుంబాలు ఉన్నాయన్నది స్వయంగా సిట్ అధికారులు వ్యక్తపరుస్తున్నదే.
అంటే… జూలై నెలాఖరు వరకు జరగబోయే విచారణలతో ఈ డ్రగ్స్ కేసు ఎపిసోడ్ కు శుభంకార్డు పడే ఆస్కారం లేదు. అసలు సమస్య… ఆగష్టులో ఉండనుంది అన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అవును… ప్రస్తుతం లభిస్తున్న అదనపు సమాచారం ద్వారా మరింత మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ కానున్నాయన్నది అధికారిక వార్త. అంటే ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న వారంతా డ్రగ్స్ కేసులో ఎంతోకొంత ప్రమేయం ఉందని ఒప్పుకున్నట్లేనా? అదే నిజమైతే మరి వీరిపై చర్యలు ఉంటాయా? లేక కౌన్సిలింగ్ ల వరకే పరిమితమవుతాయా? వాటికి సమాధానం ఆగష్టులోనే లభించనుంది.
ఈ డ్రగ్స్ కేసులో సినీ దిగ్గజాల ప్రమేయం ఉందని తేలితే, ఈ ఆగష్టు మాసం సినీ పరిశ్రమ ఎదుర్కొనబోయే అతిపెద్ద సంక్షోభంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్న వారంతా ప్రస్తుతం ఏదొక సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామ్యులై ఉన్నవారే! ఒకవేళ ఎలాంటి ప్రమేయం లేదని తేలితే… వంద సినిమాలు వరుసగా హిట్టయినా కలుగని ఆనందం… ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలలో కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. దీంతో వచ్చే నెల కోసం ఈ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ మరియు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…