ఒకరి తర్వాత ఒకరు…టాలీవుడ్ హీరోలకు ఇది గడ్డుకాలమా…?

Tollywood Heros Surgeriesప్రస్తుతం టాలీవుడ్ లో సర్జరీల సీజన్ నడుస్తోంది. వరుసగా హీరోలు సర్జరీలు చేయించుకుంటున్నారు. బాల‌కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, సాయిధరమ్ తేజ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా హీరోలందరూ వరసబెట్టి సర్జరీలు చేయించుకుంటున్నారు.

ఈ మధ్యే నందమూరి బాల‌కృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో నాలుగు గంటలపాటు సర్జరీ చేశారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడిన బాలయ్య ఇప్పుడు కోలుకున్నారు.

ADVERTISEMENT

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చేతికి కట్టుకట్టుకని కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. కుడిచేత్తో ఏ పనిచేసినా కష్టం ఉంటుందని..తిమ్మిరిలు వస్తున్నాయని…వైద్యులు సర్జరీ చేశారని చిరు క్లారిటీ ఇచ్చారు. అపోలో హాస్పటల్ లో కాస్మొటిక్ సర్జన్ ఆద్వర్యంలో చేతికి సర్జరీ జరిగినట్లు చెప్పారు.

ఈమధ్యే రోడ్డు ప్రమాదానికి గురైనా హీరో, మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు సర్జరీ జరిగింది. యాక్సిడెంట్లో ఆయన కాలర్ బోన్ విరగడంతో…దాదాపు 24 గంటల పాటు వైద్యులు సర్జరీ చేశారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సర్జరీ చేయించుకున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు రజనీకి సర్జరీ చేశారు. కరోటిడ్ ధమనిలో బ్లాక్ సమస్య తలెత్తడటంతో సర్జరీ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ చేతి వేళ్లకు ఫాక్చర్ కావడంతో సర్జరీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంట్లో జిమ్ చేస్తుండగా వేళ్లు ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇది టాలీవుడ్ కు సర్జరీల సీజన్ అని చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories