
మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న “కేశవ”పై కూడా ఇంత బజ్ ఉందంటే… అది నిఖిల్ చలవే. ఇండస్ట్రీలో సైతం పాజిటివ్ బజ్ తో విడుదలవుతోన్న “కేశవ” సినిమా తర్వాత నిఖిల్ చేయబోయేది ఒక రీమేక్ అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇంతకాలం వరకు కొత్తగా కధలను ఎంపిక చేసుకుంటూ వరుస సక్సెస్ లు చవిచూసిన ఆ నిఖిలే, కెరీర్ లో మొదటి సారిగా ఓ రీమేక్ చిత్రంలో నటించబోతున్నాడు. గతేడాది కన్నడ నాట విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన “కిరిక్ పార్టీ” సినిమాను తెలుగులో నిఖిల్ రీమేక్ చేయబోతున్నాడు.
జూన్ లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా తర్వాత, చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2” ఉండబోతోందని స్పష్టం చేసాడు నిఖిల్. ‘కార్తీకేయ’ సినిమా ఎక్కడైతే ముగుస్తుందో, ఈ సినిమా అక్కడ ప్రారంభం అవుతుందని చెప్పిన నిఖిల్, ఫస్ట్ టైం రీమేక్ చేయడం పట్ల మరో కొత్త అనుభవంగా చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో మెయిన్ ‘థీమ్’ను మాత్రమే తీసుకున్నామని, కధను మొత్తం తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చుకున్నామని తెలిపారు. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా రీమేక్ లు చేయడం తప్పు లేదు గానీ, రీమేక్ లు చాలా ప్రమాదకారి అన్న విషయాన్ని మాత్రం గుర్తించుకోవాలి.
గత తరంలో వెంకటేష్, ఈ తరంలో పవన్ కళ్యాణ్ లు అతి ఎక్కువ రీమేక్ చిత్రాలలో నటించిన హీరోలుగా మిగిలిపోయారు. ఫెయిల్యూర్ చవిచూసిన ప్రతిసారి, విజయం కోసం రీమేక్ వైపుకు చూడడం సహజమైపోతుందన్న విషయం ఈ ఇద్దరు బడా హీరోలు టాలీవుడ్ కు నేర్పారు. ఒక రకంగా ఇది డేంజర్ జోన్ కూడా! సక్సెస్ వస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ రీమేక్ కూడా ఫెయిల్ అయితే ‘కాటమరాయుడు’ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. మరో వైపు ‘గురు’ సక్సెస్ చవిచూసిన వెంకీని చూసాం. కనుక ‘చిలక్కొట్టుడు’ మాదిరి అయితే రీమేక్ లు పర్లేదు గానీ, వాటిపైనే డిపెండ్ అయితే ఏదొక సమయంలో చేదు అనుభవం తప్పకపోవచ్చు.
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…