Telugu

మూగబోయిన టాలీవుడ్…!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తుంది. ఒకరి సినిమా విడుదలైనప్పుడు మరొకరు ఆ సినిమా ను ఉద్దేశించి హీరోకు శుభాకాంక్షలు తెలపడం దానికి సదరు నటులు కృతజ్ఞతలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది.

ఒక్కో సందర్భంలో అయితే చిన్న సినిమాలకు కూడా స్టార్స్ నుంచి పెద్ద ప్రశంసలే దక్కుతున్నాయి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అంటూ ముందుకొచ్చిన రావు రమేష్ సినిమాకు కూడా మహేష్ బాబు వంటి స్టార్ హీరో స్పందిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ADVERTISEMENT

అలాగే ఈ మధ్యకాలంలో చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అందుకున్న మత్తువదలరా – 2 కూడా మెగా స్టార్ చిరు అభినందనలు అందుకుంది. ఇక పాన్ ఇండియా గా వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన బాహుబలి, RRR , కల్కి, యానిమల్ మూవీలకు కూడా సెలబ్రేటిస్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో ప్రశంసలు దక్కాయి.

ఇలాంటి పరిస్థితులలో పుష్ప తో పాన్ ఇండియా లో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సుక్కు, అల్లు మూడేళ్ళ కష్టానికి టాలీవుడ్ ఎందుకో మూగబోయిందే అనిపిస్తుంది. పుష్ప -2 గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయినా అన్ని భాషలలోను ప్రేక్షకుల అంచనాలను అందుకుని రికార్డుల వేట కొనసాగిస్తుంది.

అటు మూవీ బిజినెస్ పరంగానే కాదు ఇటు బన్నీ ఫెర్ఫామెన్స్ పరంగా కూడా పుష్ప – 2 తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. అటువంటి సినిమా గురించి, ఇటువంటి నటన గురించి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

దీనికి కారణం ఏమిటో ఒక్కసారి అల్లు తో పాటుగా చిత్ర యూనిట్ కూడా ఆలోచించుకోవాలి. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బన్నీ అల్లు బ్రాండ్ ను పెంచడానికి మరెవరినో తగ్గిస్తున్నారు అనే భావన ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుందా.? లేక మరేదైనా బలమైన కారణం టాలీవుడ్ ను మౌన దీక్షలో ఉంచిందా.? అనేది తేలాల్సి ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ స్థానిక పరీక్షలు వైసీపీకి కాదు.. కూటమికే!

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీలు అవలీలగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాయి. కనుక ఏపీలో కూటమి పార్టీలు కూడా…

25 minutes ago

Shocking From CEO: Mass Layoffs In Indian IT?

The Indian IT sector is already witnessing a period of turbulence with several companies starting…

28 minutes ago